ఏ మెగా హీరో ఫంక్షన్ అయినా పవర్ స్టార్ పవర్ స్టార్ అని ఫ్యాన్స్ కేకలేసినట్టు నందమూరి బాలకృష్ణ, ఎన్.టి.ఆర్ ఇద్దరు ఒకే వేదిక మీద కనిపిస్తే నందమూరి ఫ్యాన్స్ ఎన్.టి.ఆర్, ఎన్.టి.ఆర్ అని అరవడం కామన్. నిన్న జరిగిన 118 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా అదే రిపీట్ అయ్యింది. స్టేజ్ మీద బాలకృష్ణ, ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రాం ముగ్గురు ఉన్నా అందరు ఎన్.టి.ఆర్ అని కేకలేశారు.
కళ్యాణ్ రాం మాట్లాడేప్పుడు ఆ అల్లరి మరింత ఎక్కువవగా కొద్దిసేపు ఓపిక పట్టిన కళ్యాణ్ రాం సభా మర్యాదను కాపాడండి.. పెద్దాయన స్పూర్తితో సభా మర్యాదను మర్చిపోవద్దు అంటూ మనం అంతా నందమూరి అభిమానులం.. మన దేవుడు నందమూరి తారక రామారావు అంటూ కళయాణ్ రాం నందమూరి ఫ్యాన్స్ మీద కాస్త ఫైర్ అయ్యాడు.
తన ప్రతి సినిమా కొత్తగా ప్రయత్నిస్తున్నా ఫెయిల్ అవుతున్నా కాని ఈ సినిమా మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. తప్పకుండా ఈ సినిమా అందరి అంచనాలకు తగినట్టు ఉంటుందని అన్నారు కళ్యాణ్ రాం.