ప్రభాస్ ‘ప్రాజెక్ట్​ కె’లో విలన్​గా కమల్​హాసన్​!

-

పాన్​​ ఇండియా స్టార్​ ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ప్రాజెక్ట్ కె’. మహానటి ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. థర్డ్​ వరల్డ్ వార్​(మూడో ప్రపంచ యుద్ధం) నేపథ్యంలో సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో సూపర్‌ హీరో మూవీగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఈ చిత్రంలో ప్రభాస్​తో పాటు బాలీవుడ్ స్టార్స్​ అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఇప్పుడీ చిత్రంలో మరో బడా స్టార్ నటించనున్నట్లు తెలిసింది. ఆయన ఎవరంటే.. యూనివర్సల్​ స్టార్​ కమల్ హాసన్. కమల్ ఈ చిత్రంలో విలన్​గా నటించబోతున్నారట. దీనికోసం ఆయన రూ.150 కోట్ల భారీ పారితోషికాన్ని తీసుకోబోతున్నట్లు కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయం సోషల్​మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి ఇందులో నిజమెంతో తెలియదు గానీ సినీ ప్రియులు మాత్రం సర్​ప్రైజ్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news