Rolex : సూర్యకు కమల్​హాసన్ కిస్.. ఫొటో వైరల్

-

విశ్వనటుడు కమల్ హాసన్​కు చాలా రోజుల తర్వాత విక్రమ్ సినిమా రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. ఈ మూవీలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సూర్యా ప్రధాన పాత్రల్లో నటించారు. ముఖ్యంగా సూర్య నటించిన రోలెక్స్ పాత్ర ఇండస్ట్రీని షేక్ చేసింది. సూర్య క్యారెక్టర్​కు సినిమా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తాజాగా ఈ విషయంపై కమల్ హాసన్ మరోసారి స్పందించారు. చెన్నైలో జరిగిన వికటన్ సినిమా అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న కమల్‌హాసన్‌.. ఓ విభాగంలో సూర్యకు అవార్డు అందించారు.

‘‘రోలెక్స్‌ పాత్ర.. మా సినిమా మరెంతో మందికి చేరువయ్యేలా చేసింది. ఈ పాత్ర చేయడానికి అంగీకరించినందుకు సూర్యకు మరోసారి ధన్యవాదాలు. ఇది మేము చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయం. ఒక్క ఫోన్‌కాల్‌ చేసిన వెంటనే సూర్య ఈ పాత్ర చేయడానికి ఓకే అన్నాడు’’ అంటూ సూర్యని హత్తుకుని ఆయన నుదిటిపై కమల్‌ ముద్దుపెట్టుకున్నారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ‘విక్రమ్‌ – రోలెక్స్‌ను ఒకే స్టేజ్‌పై చూడటం ఆనందంగా ఉంది’ అంటూ నెటిజన్లు అంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news