రేవంత్-బండి-షర్మిల ఉమ్మడి పోరు..కేసీఆర్ సర్కారుకు షాక్!

-

తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది..ఇంతకాలం వేరు వేరుగా కే‌సి‌ఆర్ సర్కారుపై పోరాటం చేస్తున్న ప్రతిపక్షాలు ఇప్పుడు ఉమ్మడిగా పోరాడేందుకు సిద్ధమవుతున్నాయి. అది కూడా తెలంగాణలో సంచలనం సృష్టించిన టి‌ఎస్‌పి‌ఎస్‌సి పేపర్ లీకేజ్ అంశంపై నిరుద్యోగులకు, యువతకు న్యాయం జరిగే వరకు పోరాటం చేయాలని డిసైడ్ అయ్యారు.

ఇటీవల పేపర్ లీకేజ్ అంశం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో పలువురు నిందితులని కూడా అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో అధికార పార్టీకి చెందిన వారు కూడా ఉన్నారని ప్రతిపక్ష నేతలు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసు విచారిస్తున్న సిట్ అధికారులు ప్రతిపక్ష నేతలకు నోటీసులు ఇచ్చి షాక్ ఇచ్చారు. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే దీనిపై టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బి‌జే‌పి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల, బి‌ఎస్‌పి నేత ప్రవీణ్ కుమార్ పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. అయితే వారి పోరాటలని కే‌సి‌ఆర్ సర్కార్ అణిచి వేయడానికి చూస్తుంది.

Telangana Politics

దీంతో కే‌సిఆర్ సర్కార్ కు షాక్ ఇచ్చేలా ప్రతిపక్షాలు ఉమ్మడి పోరుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే షర్మిల..రేవంత్, బండికు ఫోన్ చేశారు. నిరుద్యోగుల విషయంలో కలిసి పోరాడదామని ఇరువురు నేతలను షర్మిల కోరారు. ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చెద్ధామని, ప్రగతి భవన్ మార్చ్ పిలుపునిద్దామని, సీఎం కేసీఆర్ మెడలు వంచాలి అంటే ప్రతిపక్షాలు ఏకం కావాలని ఆమె..రేవంత్, బండిని కోరారు.

అయితే షర్మిల ఫోన్‌కాల్‌పై బండి సంజయ్, రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఉమ్మడిగా పోరాటం చేసేందుకు బండి సంజయ్ మద్దతు తెలిపారు. ప్రతిపక్షాలు కలిసి పోరాటం చేయాల్సిన సమయం ఏర్పడిందని రేవంత్ రెడ్డి అన్నారు. త్వరలో సమావేశం అవుదామని,  నిరుద్యోగుల విషయంలో ఉమ్మడి పోరాటానికి సిద్ధమవుదామని ఇరువురు నేతలు చెప్పినట్లు సమాచారం. ప్రతిపక్ష నేతలు ఏకమై పోరాటం చేస్తే కే‌సి‌ఆర్ సర్కారుకు షాక్ తగలడం ఖాయమని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news