భార్య కోసమే కొత్త బడ్జెట్ పాలసీ అంటూ.. రిషి సునాక్​పై మరోసారి విమర్శలు

-

బ్రిటన్‌ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రిషి సునాక్​ను వివాదాలు, విమర్శలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా రిషి సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్​లో ఓ కొత్త పాలసీపై విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. తన భార్య అక్షతా మూర్తి వ్యాపార ప్రయోజనాల కోసమే ఆ నూతన విధానాన్ని తీసుకొచ్చారంటూ రిషిపై విమర్శలు గుప్పిస్తున్నాయి.

మార్చి ఆరంభంలో యూకే సర్కార్ స్ప్రింగ్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అందులో చిన్నారుల సంరక్షణకు ఆయాల (ఛైల్డ్‌ మైండర్స్‌) సేవలను అందించే కంపెనీలకు ప్రోత్సాహాకాలు కల్పించేలా నూతన పైలట్‌ పథకాన్ని ప్రకటించారు. ఇలాంటి సేవలనే అందించే ‘కోరు కిడ్స్‌ లిమిటెడ్‌’ అని కంపెనీలో రిషి సతీమణి అక్షతా మూర్తి వాటాదారుగా ఉన్నారు. భార్య వ్యాపార ప్రయోజనాల కోసమే ప్రధాని ఈ పైలట్‌ ప్రాజెక్టును ప్రవేశపెట్టారంటూ ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

‘‘ఈ స్కీమ్‌ను తీసుకురావడం వెనుక ప్రత్యేక ఆసక్తి ఏమైనా ఉందా? సొంత ప్రభుత్వ విధానాల నుంచి రిషి సునాక్‌ కుటుంబం అదనపు ఆదాయాన్ని పొందాలనుకుంటుందా? ఈ ప్రశ్నలకు సునాక్‌ సమాధానం చెప్పాల్సిందే’’ అని ప్రతిపక్ష లిబరల్‌ డెమోక్రాట్‌ చీఫ్‌ విప్‌ వెండీ ఛాంబెర్లేన్ ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news