విశ్వనాథ్ గారితో అనుబందం తలచుకొని సెల్యూట్ చేసిన కమల్ హాసన్.!

కళాతపస్వి కె విశ్వనాథ్ మృతి సినీ పరిశ్రమని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆయన చేసిన సినిమాలు ఒక్కొక్కటి ఒక్కో అద్భుత కళాకండం.. ఆయనకు మాత్రమే సాద్యమయ్యే క్లాసికల్  సినిమాలను తీసి తెలుగు సినీ ప్రేక్షక హృదయాలను రంజింప చేశారు కె విశ్వనాథ్. ఆయన మరణ వార్త విన్న సినీ ప్రముఖులు విశ్వనాథ్ గారితో తమకున్న అనుబంధాన్ని పంచుకుంటూ సోషల్ మీడియాలో స్పందన తెలియచేస్తున్నారు.

ఆయన చేసిన సినిమాలు చూస్తూ ఆయన్ని గుర్తు చేసుకుంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు.సినిమాల్లో అస్సలు డ్యాన్సులు ఫైట్లు లేకుండా కేవలం సంగీత ప్రధానంగా పెట్టి సినిమా తీయడం అనేది ఆయన మాత్రమే చేసి చూపించారు. ఈ పరిశ్రమ లో ఎంతో మంది డైరెక్టర్ కు గౌరవం తెప్పించిన ఘనుడు ఆయన. ఇక తాను కమల్ హాసన్ తో చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.

కమల్ హాసన్ ట్విట్టర్‌లో కళాతపస్వి కె విశ్వనాథ్ కు నివాళి అర్పించారు. కమల్ తన భాదతో రాస్తూ “సెల్యూట్ టు ఎ మాస్టర్” అని క్యాప్షన్ ఇచ్చారు. “కళాతపస్వి కె. విశ్వనాథ్ గారు జీవిత పరమార్థాన్ని మరియు కళ యొక్క అమరత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నారు. అందువల్ల అతని కళ అతని జీవితకాలం, ప్రస్థానానికి మించి జరుపబడుతుంది. అతని కళకు, చిరకాలం జీవించండి” అని రాసుకోచ్చారు.