మణికర్ణిక తెలుగు ట్రైలర్..!

-

ఝాన్సి రాణి లక్ష్మి భాయ్ బయోపిక్ గా కంగనా రనౌత్ నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న సినిమా మణికర్ణిక. జీ స్టూడియోస్ బ్యానర్ లో కమల్ జైన్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు ట్రైలర్ రీసెంట్ గా రిలీజైంది. తెల్లోడి గుండెల్లో నిద్రపోయిన ఝాన్సీ రాణి వీరత్వాన్ని తెర మీద ఆవిష్కరించడానికి చేసిన ఈ ప్రయత్నం బాగానే ఉందని చెప్పాలి.

స్వాతంత్రం కోసం 160 ఏళ్ల క్రితం జరిగిన కథ ఇది.. ఇప్పుడు చరిత్రగా మారింది. ఆ చరిత్రను మళ్లీ మనకు తెలియ చెప్పేలా చేస్తున్న ఈ మణికర్ణిక సినిమా వస్తుంది. కంగనా రనౌత్ ప్రాణం పెట్టి చేసిందని ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. అసలైతే ఈ సినిమాను డైరక్టర్ క్రిష్ మొదలు పెట్టినా మధ్యలో వదిలి వచ్చేశాడు. అయినా సరే డైరక్టర్ గా క్రిష్ కు క్రెడిట్ ఇస్తుంది కంగనా రనౌత్.

కంగనా నటనే హైలెట్ గా నిలిచేలా వస్తున్న ఈ మణికర్ణిక జనవరి 25న రిలీజ్ కాబోతుంది. తెలుగు, తమిళ, హింది భాషల్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా బాహుబలి రేంజ్ లో ప్రమోట్ చేయాలని చూస్తున్నారు. మరి మణికర్ణిక సంచలనాలు ఎలా ఉంటాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version