లో దుస్తులు లేకుండా ఫొటో షూట్ చేశా.. షాకింగ్ విష‌యాల‌ను బ‌య‌ట పెట్టిన కంగ‌నా ర‌నౌత్‌..!

-

ప్ర‌ముఖ బాలీవుడ్ నిర్మాత పహ్లాజ్ నిహ్లానీ నిర్మించిన ఐ ల‌వ్యూ బాస్ అనే సినిమాకు గాను ఫొటోషూట్ కోసం వెళ్తే.. ఎలాంటి లోదుస్తులు ధ‌రించ‌కుండా ఫొటోషూట్‌లో పాల్గొనాల‌ని కండిష‌న్ పెట్టార‌ని చెప్పింది.

ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్‌కు వివాదాలు ఏమీ కొత్త కాదు. ఎప్పుడూ ఏవో వ్యాఖ్య‌లు చేస్తూ వివాదాల్లో ఇరుక్కుంటుంది. మొన్నామ‌ధ్య‌ విడుద‌లైన మ‌ణిక‌ర్ణిక చిత్రంపై కూడా కంగ‌న వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసింది. ఆ వివాదం స‌ద్దుమ‌ణిగి చాలా రోజులు కూడా అవుతోంది. అయితే ఇప్పుడు ఆమె వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌క‌పోయినా, ఆమె చేసిన కామెంట్లు మాత్రం ప్ర‌స్తుతం సినీ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. త‌న కెరీర్ ఆరంభంలో తాను ఎలాంటి దారుణ‌మైన స్థితిలో ఇరుక్కుందో కంగ‌న తాజాగా వెల్ల‌డించింది.

కంగ‌నా రనౌత్ ఇటీవ‌లే ఓ మీడియా చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ… తాను ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టాన‌ని తెలిపింది. అందువ‌ల్లే తాను కెరీర్ ఆరంభంలో చాలా ఇబ్బందుల‌ను ఎదుర్కొన్నాన‌ని, ముఖ్యంగా ఆడిష‌న్స్‌లో ద‌ర్శ‌కులు, నిర్మాత‌ల‌ను మెప్పించాల్సి వ‌చ్చేద‌ని చెప్పింది. అలా చేస్తేనే అవ‌కాశాలు ఇచ్చేవార‌ని తెలిపింది. ఆడిష‌న్స్ పేరిట నూత‌న న‌టీమ‌ణుల‌ను సెట్‌ల‌లో లైంగికంగా వేధిస్తారంటూ చెప్పుకొచ్చింది.

తాను ప్ర‌ముఖ బాలీవుడ్ నిర్మాత పహ్లాజ్ నిహ్లానీ నిర్మించిన ఐ ల‌వ్యూ బాస్ అనే సినిమాకు గాను ఫొటోషూట్ కోసం వెళ్తే.. ఎలాంటి లోదుస్తులు ధ‌రించ‌కుండా ఫొటోషూట్‌లో పాల్గొనాల‌ని కండిష‌న్ పెట్టార‌ని చెప్పింది. అయితే తాను ఆ నిబంధ‌న‌కు లోబ‌డే ఫొటోషూట్‌లో పాల్గొన్నాన‌ని, కానీ లోదుస్తులు వ‌ద్ద‌ని చెప్ప‌డంతోపాటు శ‌రీరం పై నుంచి కింది వ‌ర‌కు పలుచ‌ని వ‌స్త్రాన్ని క‌ట్టుకోవాల‌ని చెప్పార‌ని.. అది త‌న‌కు ఇబ్బంది క‌లిగించింద‌ని.. అందుకే ఇష్టం లేక‌పోయినా.. ఎలాగో ఫొటోషూట్ ముగించి ఆ త‌రువాత ఫోన్ నంబ‌ర్ మార్చేసి.. ఆ వైపు కూడా చూడ‌లేద‌ని కంగ‌న తెలిపింది. ఆ త‌రువాత కొంత కాలానికి 2006లో గ్యాంగ్ స్ట‌ర్ చిత్రంలో అవకాశం ద‌క్కింద‌ని.. కానీ అందులో న‌టించడం కోసం పోకిరి సినిమాను వ‌దులుకున్నాన‌ని తెలిపింది. కానీ పూరీ జ‌గ‌న్నాథ్ దర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఏక్ నిరంజ‌న్ సినిమాలో తాను న‌టించాన‌ని కంగ‌నా రనౌత్ తెలిపింది. మొద‌ట్లో త‌న త‌ల్లిదండ్రులు సినీ న‌టిన‌వుతానంటే భ‌య‌ప‌డ్డార‌ని, కానీ ఇప్పుడా భ‌యం లేద‌ని ఆమె చెప్పుకొచ్చింది..!

Read more RELATED
Recommended to you

Latest news