- కలి గతాబ్దాః – 5120,
- క్రీస్తుశకం – 2019-20
- శ్రీశంకరాచార్య సంవత్సరములు – 2090
- శ్రీ రామానుజాచార్య సం॥లు – 1002
నవ నాయక ఫలాలు: ఈ సంవత్సరమున రాజు-శని, మంత్రి-రవి, సేనా-ధిపతి-శని, సస్యాధిపతి-బుధుడు, ధాన్యాధిపతి-చంద్రుడు, అర్ఘాధిపతి-శని, మేఘాధిపతి-శని, రసా-ధిపతి-శక్రుడు, నీరసాధిపతి-బుధుడు, రాజవాహన-ము-అశ్వము, పశుపాలకుడు-బలరాముడు, గోష్ఠా-గార ప్రాపకుడు (స్థాన సంరక్షుడు)-బలరాముడు; గోష్ఠాద్బహిష్కర్త-బలరాముడు.
ఈ విధంగా నవనాయక వర్గంలో పాపాధిక్యం, ఉపనాయక వర్గంలో పాపాధిక్యం ఉండుట వలన దేశంలోని విభిన్న ప్రాంతాలలో కలహాలు, మత ఘర్షణలు, సమయానికి వర్షాలు కురవక పోవడము, ఈతిబాధలు, పరస్పర విరోధాలు ఉండే అవకాశాలు ఉంటాయి. పశువులకు సుభిక్ష క్షేమారోగ్యములు ఉంటాయి. పశువులకు ఇబ్బంది లేకుండా అనుకూలంగా వాతావరణము ఉండే అవకాశం ఉంది. రాజు-శని అగుటవలన వర్ష-ములు స్వల్పంగా కురుస్తాయి. అధికారుల మధ్య సమన్వయలోపంతో కలహాలు.

ఇరుగు పొరుగు దేశాల మధ్య తరచుగా సంఘర్షణలు చోటు చేసుకొనుట. యుద్ధ వాతావరణము ఉండే అవకాశము. స్వల్ప వృష్ఠి మూలంగా ప్రజానీకంలో అనారోగ్యము, దొంగల, ఆకలి బాధలు పెరుగుట. పంటల దిగుబడి తగ్గడం మూలంగా ప్రజలు పర ప్రాంతములకు వలస వెళ్లే అవకాశాలు ఉంటాయి. కారము, మసాలా వస్తు-వులు, రసాయన పదార్థాలు, బొగ్గు, నూలు, నువ్వుల నూనె, నల్లని ధాన్యములు, మిణుములు, అవిసెలు, చర్మములు, చెప్పులు, గొంగళ్లు, ఇనుము, సీసము, కలప, పశువులు, గేదెలు, అల్యూమినియం, వేరుశ-నగ, పసుపు, ఎరువులు మొదలైన వస్తువుల ధరలు పెరిగే అవకాశము ఉన్నది. ఆహార ధాన్యముల కొరత మూలంగా ప్రజలలో కంట్రోల్ వాతావరణము ఉంటుంది. రాజకీయ పరంగా అస్థిరత ఉంటుంది. దుర్మార్గులు, ప్రజలను మోసం చేసేవారి సంఖ్య పెరుగుతుంది. మతోన్మాదము పరాకాష్ఠకు చేరడం మూలంగా అక్కడక్కడ కలహాలు ఏర్పడతాయి. న్యాయ మార్గంలో ఉన్న వారికి కాలము కలిసి రాక-పోవడము, మిత్రభేదము ప్రబలే అవకాశము బాగా ఉన్నది.
రాజవాహనము
అశ్వము అగుట వలన ప్రకృతి వైపరీత్యాలు. భూకంపము, వరదలు మొదలలైనవి సంభవిస్తాయి. పొరుగుదేశములతో యుద్ధ వాతావరణము. కొన్ని ప్రాంతములలో స్వల్ప వృష్ఠి మూలంగా పంటలు పండక పోవడము. ఆహార ధాన్యములకు కొరత తద్వారా ధాన్యాదులకు ధరలు పెరుగుట. జనహాని, ధనహాని, భక్తి భావములు లోపించుట మొదలైన ఫలితాలు ఉంటాయి.
మంత్రి
రవి అగుట వలన అధికారులకు, దేశాధినేతలకు పరస్పర వైషమ్యము, తద్వారా ఇరుగు పొరుగు దేశముల మధ్య యుద్ధ వాతావరణము. అధర్మ బుద్ధి పెరుగుట, వర్షాభావముతో పంటలు తగ్గుట, ధాన్యా-దుల ధరలు పెరుగుట. అనావృష్ఠి రోగాలు కూడా ప్రబలే అవకాశము. ఆకలి బాధలు ప్రజానీకానికి ఆహార ధాన్యములు అందుబాటులో ఉండక పోవుట, రస వస్తువుల ధరలు, నూనెగింజలు, నూనెల ధరలు తగ్గుట. ధాన్యములు, విద్యుచ్ఛక్తి పరికరములు, యంత్రములు, ఇనుము, ఇత్తడి, తగరము మొదలగు వాని ధరలు పెరుగును. వెండి, బంగారము, పత్తి ధరలు కూడా పెరుగును.
సేనాధిపతి – శని అగుట వలన దేశాధినేతల మధ్య పరస్పర వైరము, తద్వారా యుద్ధ వాతావరణము నెలకొనుట. సైన్యములకు నష్టము వాటిల్లుట. ప్రజలలో అన్యాయము పెరుగుట. నల్లని ధాన్యములు, నల్లని భూములు బాగుగా ఫలించును. యుద్ధ వాతావరణము వలన ప్రజానీకం భయభ్రాంతులకు గురి అగుట. వ్యాపారమునందు ఒడుదొడుకులు. రవాణా సౌకర్యము తగ్గుట వలన ధాన్యాదుల ధరలు పెరుగుట. కొన్ని ప్రదేశములందు మాత్రమే ధరలు తగ్గియుండుట. రాజకీయ అస్థిరత ఉంటుంది.
సస్యాధిపతి
బుధుడు అగుట వలన వర్షము మొదలగు వాతావరణ ఇబ్బందుల మూలంగా మొలకలు సరిగా మొలవక పోవడము, తెగుళ్లు ఏర్పడుట. అల్పవృష్ఠి ఉంటుంది. నెయ్యి, నూనె గింజలు, రసాయనిక ఎరువులు, పత్తి, కలప, దూది, నూలు, వస్త్రములు, పసుపు వ్యాపారములు కాగితము, పెసర్లు, వెండి, బంగారము మొదలగు వాటి ధరలు పెరుగును.
ధాన్యాధిపతి
చంద్రుడు అగుట వలన గోవులకు, పశువులకు అనుకూల వాతావరణం ఉంటుంది. అవి సమృద్ధిగా పాలను ఇచ్చే అవకాశము. ప్రజానీకానికి అనుకూలమెన పాలు లభించే అవకాశము. తద్వారా ఆరోగ్యము, సుభిక్షము. వెన్న, నెయ్యి, పాలు, పెరుగు, వెండి, బంగారం, బియ్యం, చెరుకు, పంచదార మొదలైన వస్తువుల ధరలు సరసంగా అందుబాటులో ఉంటాయి.
అర్ఘాధిపతి
శని అగుట వలన సామాన్య వర్షములు ఉంటాయి. దొంగలు, అగ్ని, రోగములు మొదలైన వాటితో ప్రజలకు ఇబ్బందులు ఉంటాయి. ఆహార ధాన్యముల కొరత ఏర్పడుతుంది. రాజకీయంగా ఒడుదొడుకులు. అక్కడక్కడ ప్రజాక్షోభ ఉంటుంది. నల్లని భూములు, నల్లని ధాన్యములు, నువ్వులు, మినుములు, బొగ్గు, సీసం, ఇనుము, నల్లమందు, అవిసెలు, ఆవాలు మొదలైన వస్తువుల ధరలు సరస-ముగా ఉండును.
మేఘాధిపతి
శని అగుట వలన వర్షములకు ప్రతి-బంధకము అనగా మేఘావృతమై ఉన్నాఎక్కువగా గాలి వీచటం మూలంగా వేరే ప్రాంతములో వర్ష-ములు పడడము. లేదా వర్షము పడకుండా తేలిపోవ-డము మొదలైన సూచనలు ఉంటాయి. అధికారులకు ధనాభావము, ప్రజానీకానికి చలి, ఈతిబాధలు, వాతావరణం మూలంగా జ్వరాలు ప్రబలుట. ఆహార ధాన్యముల కొరత ఏర్పడుట మొదలైన ఫలితాలు ఉంటాయి.
రసాధిపతి
శుక్రుడు అగుట వలన కుంకుమపువ్వు, కర్పూరము, అగరు వస్తువులు, చందనము, అత్తరు, సెంటు, పన్నీరు మొదలైన సుగంధ ద్రవ్యములు, పాదరసము వంటి నిర్గంధ వస్తువులు, క్షారములు, ఉప్పు, రసాయన పదార్థములు, పసుపు, బంగాళా దుంపలు, కంద మూలాదులు, పండ్లు, పుష్పములు ఎక్కువగా లభించును. అనగా వీటి ధరలు తగ్గి యుండును. ఉత్పత్తి పెరుగునని గ్రహించవలెను.
నీరసాధిపతి
బుధుడు అగుట వలన వస్త్రములు, అద్దకం గుడ్డలు, శంఖములు, చందనము, సుగంధ ద్రవ్యముల ధరలు కొంత తగ్గి నిలబడి యుండును.
పశుపాలకుడు
బలరాముడు అగుటతో దేశమందు అంతటనూ సస్స్యానుకూల వర్షములు కలిగి సస్యములు చక్కగా ఫలించును. మధ్య దేశమందు విశేషముగా సుభిక్షము, పాడిపంటలు సమృద్ధిగా యుండును. గోష్టాగార ప్రాపకుడు – బలరాముడు అగుటచే పాడిపంటలు సమృద్ధి యున్ననూ, ప్రాణికోటి క్షేమారోగ్యములు మధ్యమముగా ఉండును. ధరలు మధ్యమము. గోష్ఠాద్బహి ప్రాపకుడు – బలరాముడు అగుటతో సువృష్టి, సస్యసంపత్తి, సుభిక్షము, అప్పుడప్పుడు కొన్ని ప్రాంతములందు కలుగును. ధాన్యాదుల ధరలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి.
పశుపాలకుడు – గోష్ఠాగార ప్రాపకుడు – బలరాముడు
అగుటతో బలరామునికి సంపూర్ణాధిపత్యము వలన సస్యానుకూల వర్షములు, సస్యానుకూల వర్షములతో పంటలు బాగుగా ఫలించును. ముఖ్యంగా దేశము మధ్య ప్రాంతమునందు విశేషంగా పాడిపంటలు, క్షేమారోగ్యాలు ఉంటాయి.
-కేశవ
శ్రీ వికారి నామ సంవత్సరంలో మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ క్రింది వాటిని క్లిక్ చేయండి..











