సంజ‌య్‌ను కంగ‌నా ఆటాడుకుందిగా..

సంజ‌య్‌ను రౌత్‌ను కంగ‌నా ఎంత చీప్ చేసిందంటే… ఆటాడుకుందిగా..
దివంగ‌త బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న త‌ర్వాత బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ బాలీవుడ్‌లో ఉన్న నెపోటిజం, మాఫియాను టార్గెట్‌గా చేసుకుని తీవ్ర విమ‌ర్శ‌లు చేసింది. కంగ‌నా ప్ర‌తి రోజూ ఏదో ఒక వివాదాస్ప‌ద వార్త‌ల‌తో నేష‌న‌ల్ మీడియాను అట్టుడుకిస్తోంది. ఈ క్ర‌మంలోనే కంగ‌నా సుశాంత్ మ‌ర‌ణం త‌ర్వాత విచార‌ణ విష‌యంలో నిందితుల‌కు సైతం స‌హ‌క‌రించేలా మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న స‌రికొత్త సందేహాల‌ను కూడా తెర‌మీద‌కు తీసుకువ‌చ్చింది. అక్క‌డితో ఆగ‌కుండా ముంబై పోలీసుల‌ను సైతం ఆమె టార్గెట్‌గా చేసుకుని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది.


ఇక మ‌హారాష్ట్ర మంత్రి ఆదిత్య థాక్రేను సైతం టార్గెట్ చేయ‌డంతో పాటు ఈ కేసు విచార‌ణ స‌జావుగా జ‌ర‌గ‌కుండా ఆదిత్య ఒత్తిడి చేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు చేసింది. ఈ కేసు విష‌యంలో జ‌రుగుతోన్న ప్ర‌తి ప‌రిణామంపై కంగ‌నా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూనే ఉంటోంది. ఇక కంగ‌నాపై శివ‌సేన తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతోంది. ఆమె మహారాష్ట్ర వాసి కాద‌ని శివ‌సేన ఫైర్‌బ్రాండ్ సంజ‌య్‌రౌత్ ఆరోపిస్తే కంగ‌నా ముంబైను పీవోకేతో పోల్చారు. ఇక సంజ‌య్‌రౌత్ సామ్నాలో కంగ‌నా వెన‌క బీజేపీ ఉంద‌ని.. ఓ ప్లానింగ్ ప్ర‌కారం ముంబై ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీసే కుట్ర జ‌రుగుతోందంటూ మండిప‌డ్డారు.

త‌న వెన‌క బీజేపీ ఉంద‌న్న వ్యాఖ్య‌ల‌తో పాటు ముంబైలో ఉన్న త‌న క‌ర్ణిక ఆఫీస్‌లో కొంత భాగాన్ని కూల్చివేయ‌డంతో కంగనాకు చిర్రెత్తు కొచ్చింది. ఆమె సంజ‌య్‌రౌత్‌ను ఓ ఆటాడుకుంటూ ట్వీట్ చేశారు. డ్ర‌గ్ రాకెట్ మాఫియా బ‌ద్ద‌లు కొట్టిన వారికి బీజేపీ మ‌ద్ద‌తు ఇస్తే త‌ప్పు… ప‌రువు తీస్తూ రేప్‌లు చేసే శివ‌సేన గుండాల‌కు మ‌ద్ద‌తు ఇవ్వాలంటారా సంజ‌య్ జీ అంటూ కంగ‌న రౌత్‌ను ప్ర‌శ్నించింది. డ్ర‌గ్ మాఫియాకు వ్య‌తిరేకంగా పోరాడుతోన్న ఓ మ‌హిళ‌కు బీజేపీ మ‌ద్ద‌తు ఇవ్వ‌డం త‌ప్ప‌నే క‌దా ? మీరు చెప్పేది అని ఏకేసింది.