వాడు నా చాతిని తాకాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్

1508

దీంతో వెంటనే నేను షాక్ కు గురయ్యా. ఒక ఐదు నిమిషాల వరకు ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు.. అది నా జీవితంలో మరిచిపోలేని ఘటన.. అంటూ ఉద్వేగానికి లోనయింది కంగనా. ఇటీవలే మణికర్ణిక చిత్రంతో సక్సెస్ సాధించిన కంగనా.. ప్రస్తుతం మెంటల్ హై క్యా అనే సినిమాలో నటిస్తోంది.

మహిళలకు తమ జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక చేదు అనుభవం ఎదురవుతూనే ఉంటుంది. చిన్నతనంలో కానీ.. చదువుకునే సమయంలో కానీ.. పెళ్లి తర్వాత కానీ.. ఎక్కడో ఒక చోట వాళ్లకు వేధింపులు జరుగుతుంటాయి. కానీ.. చాలామంది తమపై జరిగిన వేధింపులను ఎవ్వరికీ చెప్పుకోరు. కొంతమంది మాత్రం తమకు జరిగిన అన్యాయంపై పెదవి విప్పుతుంటారు.

తాజాగా… బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ తన చిన్నతనంలో ఎదురైన ఓ చేదు ఘటనను షేర్ చేసుకున్నది. ఇటీవల అమీర్ ఖాన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కంగనా.. తన జీవితంలో జరిగిన చేదు ఘటనపై నోరు విప్పింది. ఈ కార్యక్రమంలో స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొణె, పరిణీతి చోప్రా, కంగనా రనౌత్ పాల్గొన్నారు.

నేను చండీఘఢ్ లో స్కూల్ కు వెళ్తున్న సమయంలో మా స్కూల్ లోని అబ్బాయిలు బైకులపై వెళ్తూ అమ్మాయిలను తాకడానికి ప్రయత్నించేవారు. ఓసారి ఓ బైకర్ వేగంగా నావైపు దూసుకొచ్చి నా చాతిని తాకుతూ వెళ్లాడు. నా చాతిపై బలంగా కొట్టాడు. దీంతో వెంటనే నేను షాక్ కు గురయ్యా. ఒక ఐదు నిమిషాల వరకు ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు.. అది నా జీవితంలో మరిచిపోలేని ఘటన.. అంటూ ఉద్వేగానికి లోనయింది కంగనా. ఇటీవలే మణికర్ణిక చిత్రంతో సక్సెస్ సాధించిన కంగనా.. ప్రస్తుతం మెంటల్ హై క్యా అనే సినిమాలో నటిస్తోంది.