సినిమా వాళ్ల‌ను జ‌నాలు నీచంగా చూస్తారు.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన తాప్సీ..

373

సినిమా వాళ్ల‌ను తెరపై, లైవ్ ప్ర‌ద‌ర్శ‌న‌ల్లో చూసేందుకు జ‌నం ఆస‌క్తిని చూపిస్తార‌ని, కానీ త‌మ‌తో క‌ల‌సి జీవించేందుకు ఎవ‌రూ ఒప్పుకోరని తాప్సీ తెలిపింది. సినిమా వాళ్ల‌ను జ‌నం నీచంగా చూస్తార‌ని ఆమె త‌న ఆవేద‌న‌ను వెలిబుచ్చింది.

టాలీవుడ్‌లో ఒక‌టి, రెండు హిట్ చిత్రాల్లో న‌టించినా.. తాప్సీకి మాత్రం బాలీవుడ్‌లో మంచి అవ‌కాశాలు వ‌చ్చాయి. అలాగే ప‌లు చిత్రాలు హిట్ అవ‌డంతో ఆమె అక్క‌డ నిల‌దొక్కుకోగ‌లిగింది. ఈ క్ర‌మంలోనే ఆ ఇండ‌స్ట్రీలో తాప్సీ ఎప్ప‌టిక‌ప్పుడు ప‌లు భిన్న‌మైన చిత్రాల్లో న‌టిస్తూ న‌టిగా రోజు రోజుకీ మ‌రింత ఇంప్రూవ్ అవుతోంది. అయితే తాప్సీ ఏ విష‌యంలోనైనా కుండ బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు మాట్లాడుతుంది. ఆమె సూటిగా సుత్తి లేకుండా ఏ విష‌యాన్న‌యినా ధైర్యంగా బ‌య‌ట‌కు చెప్పేస్తుంది. ఈ క్ర‌మంలోనే తాజాగా ఓ ప్ర‌ముఖ ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌న యాక్టింగ్ కెరీర్ తొలినాళ్ల‌లో తాను ఎలా ఇబ్బందులు ప‌డిందో తాప్సీ చెప్పుకొచ్చింది.

త‌న‌కు ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేద‌ని.. క‌నుక కెరీర్ తొలి రోజుల్లో చాలా క‌ష్టాలు ప‌డ్డాన‌ని తాప్సీ చెప్పింది. త‌ను సింగిల్ యాక్ట‌ర్ కావ‌డంతో మొద‌ట్లో త‌న‌కు ఇల్లు అద్దెకు ఇవ్వ‌డానికి అంద‌రూ విముఖత వ్యక్తం చేశార‌ని తాప్సీ తెలిపింది. దీంతో త‌న‌కు అప్ప‌ట్లో ఇల్లు దొర‌క‌డం క‌ష్టంగా ఉండేద‌ని ఆమె చెప్పింది. సినిమా వాళ్ల‌ను తెరపై, లైవ్ ప్ర‌ద‌ర్శ‌న‌ల్లో చూసేందుకు జ‌నం ఆస‌క్తిని చూపిస్తార‌ని, కానీ త‌మ‌తో క‌ల‌సి జీవించేందుకు ఎవ‌రూ ఒప్పుకోరని ఆమె తెలిపింది. సినిమా వాళ్ల‌ను జ‌నం నీచంగా చూస్తార‌ని తాప్సీ త‌న ఆవేద‌న‌ను వెలిబుచ్చింది.

త‌న సినిమా కెరీర్ తొలి రోజుల్లో ముంబైలో అద్దె ఇల్లు సంపాదించేందుకు చాలా స‌మ‌యం ప‌ట్టింద‌ని తాప్సీ చెప్పింది. కానీ హైద‌రాబాద్‌లో అలాంటి వాతావ‌ర‌ణం ఉండ‌ద‌ని, ఇక్క‌డ ఇల్లు త్వ‌ర‌గానే దొరికింద‌ని కూడా ఆమె తెలిపింది. కాగా ఇప్పుడు తాను ముంబైలో కొత్త అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాన‌ని తెలిపిన తాప్సీ త‌న త‌ల్లిదండ్రులు మాత్రం ఢిల్లీలోనే ఉంటున్నార‌ని చెప్పుకొచ్చింది. ఇక తాప్సీ ప్ర‌స్తుతం బాలీవుడ్ లో ప‌లు ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉంది. అక్ష‌య్ కుమార్ స‌ర‌స‌న ఆమె మిష‌న్ మంగ‌ళ్ మూవీలో న‌టిస్తుండ‌గా, సాంద్ కీ ఆంఖ్ అనే మ‌రో చిత్రంలో ఆమె 60 ఏళ్ల వృద్ధురాలిగా, షూట‌ర్‌గా న‌టిస్తోంది. కాగా తాప్సీ న‌టించిన త‌డ్కా, గేమ్ ఓవ‌ర్ సినిమాలు ప్ర‌స్తుతం షూటింగ్‌ను పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయి.