బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ చేసిన పనికి ఓ రాష్ట్ర మాజీ సీఎం, పలువురు కేంద్ర మంత్రులు, మొత్తం పార్లమెంట్‌కు దిమ్మతిరిగింది. కనికా కపూర్ గత ఆదివారం లండన్ నుంచి తిరిగి వచ్చింది. అయితే తన పలుకుబడి, హోదా అన్నింటిని ఉపయోగించి కరోనా టెస్ట్‌లు చేయించుకోకుండానే అక్కడి నుంచి దొంగలా తప్పించుకుపోయింది. అక్కడితో అలా పోయినా ప్రమాద స్థాయి కొద్దిగానే ఉండేదేమో.
అలా తప్పించుకున్న మహాతల్లి.. ఓ గ్రాండ్ పార్టీలో పాల్గొంది. అక్కడే మాజీ సీఎం వసుందరా రాజే, ఆమె కుమారుడు ఎంపీ దుష్యంత్ కుమార్ పాల్గొన్నారు. వీరితో కలిసి కనికా తెగ ఫోజులు ఇచ్చింది. ఇదంతా అయిన ఐదారు రోజులకు కనికా చావు కబురు చల్లగా చెప్పింది. తనకు కరోనా ఉందని, పాజిటివ్ అని తేలిందని ప్రకటించింది. దీంతో వసుంధర రాజే, దుష్యంత్ కుమార్ కూడా స్వీయ నిర్భందంలోకి వెళ్లారు.
అయితే పార్లమెంట్‌లోకి కూడా ఈ వైరస్ వచ్చి ఉండే అవకాశముందని పలువురు ఎంపీలు భయపడుతున్నారు. ఎందుకంటే ఆ పార్టీ అయిన మరుసటి రోజు దుష్యంత్ పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యాడు. ఇక ఆయన పక్కన కూర్చున్న తోటి ఎంపీలు సైతం స్వీయ నిర్భందంలోకి వెళ్లిపోయారు. మొత్తానికి కనికా చేసిన పనికి దేశం మొత్తం నివ్వెరపోయింది. కరోనాను అరికట్టడానికి ప్రభుత్వం ఓ వైపు అహర్నిశలు కష్టపడుతుంటే ఇలా బాధ్యతారాహిత్యంగా ఉంటావా? ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.