డ్యూయల్ రోల్ లో మెగాస్టార్ చిరంజీవి

-

మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే..ఎన్నో అంచనాల మధ్య విడుదల కానున్న ఈ సినిమా మెగా అభిమానులను ఫుల్ గా ఖుష్ చేస్తుందట. ఈ సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్ లో కనిపిస్తాడని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఓ లుక్ బయటకు వచ్చింది..

అయితే ఆచార్య నుంచి లీక్ అయిన ఈ లుక్ లో చిరంజీవి నక్సలైట్ అని తెలుస్తుంది. అయితే ఇప్పుడు మరో విభిన్న పాత్రలో కూడా మెగాస్టార్ మెరుస్తాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా తొలుత ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావించారట. కానీ కరోనో వైరస్ ప్రభావంతో సినిమా షూటింగ్ ను వాయిదా వేస్తున్నట్లు మెగాస్టార్ ప్రకటించారు. దీంతో ఇప్పుడు సినిమా రిలీజ్ వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది.

చిరంజీవి నటిస్తున్న 152 వ చిత్రానికి ఆయన తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో కొన్ని కారణాలతో త్రిష హీరోయిన్ గా తప్పుకోవడంతో కాజల్ ను హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news