హీరో ఉపేంద్రకు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిన నటుడు

-

కన్నడతోపాటు టాలీవుడ్‌లోనూ గుర్తింపు పొందారు రియల్‌ స్టార్‌ ఉపేంద్ర. కన్నడలో ఓ సినిమా షూటింగ్‌లో ఉన్న ఉపేంద్ర ఒక్కసారిగా కుప్పకూలారు. స్వల్ప అస్వస్థతకు గురైన ఆయణ్ను చిత్రబృందం ఆస్పత్రికి తరలించినట్లు కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి. షూటింగ్ సమయంలో శ్వాస కోసం సంబంధిత సమస్యతో ఇబ్బంది పడటం వల్ల హాస్పిటల్​కు వెళ్లినట్లు ఆ కథనాల్లో ఉంది. దీంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ఉపేంద్రకు కన్నడతో పాటు తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లోనూ మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా టాలీవుడ్‌లో ఉపేంద్ర చేసిన పాత్రలు ప్రేక్షకులు చిరకాలం గుర్తుంచుకుంటారు. ముఖ్యంగా సన్ ఆఫ్ సత్యమూర్తిలో ఉపేంద్ర పాత్రకు టాలీవుడ్ ఫిదా అయింది. ప్రస్తుతం ఉపేంద్ర బుద్దివంత 2, త్రిశూలం, కబ్జా సహా మరో చిత్రంలో నటిస్తున్నారు. ఇవన్నీ శరేవగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. కాగా, ఓంకారం, ఒకేమాట, రా, రక్తకన్నీరు, సన్​ ఆఫ్ సత్యమూర్తి, గని సహా తదితర చిత్రాలతో ఆయన తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news