జపాన్ లో విపరీత క్రేజ్ తో దూసుకుపోతున్న ఆర్ఆర్ఆర్..!!

ఇప్పుడు దేశంలో నంబర్ వన్ దర్శకుడిగా మన రాజమౌళి ఎదిగిన సంగతి అందరికి తెలిసిందే. బహుబలి సినిమా లతో భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారుమళ్లీ ఆర్ఆర్ఆర్ సినిమాతో రికార్డ్స్ బ్రేక్ చేశారు రాజమౌళి. ఇప్పుడు తన తర్వాత సినిమా పై మనకంటే దేశంలో ఎక్కువుగా ఆసక్తి వుంది. అలాగే రీసెంట్ గా జపాన్ లో ఆర్ఆర్ఆర్ విడుదల కోసం రాజమౌళి, రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ అక్కడకు వెళ్ళిన విషయం తెలిసిందే.

అక్కడి ప్యాన్స్ తో వున్న ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అక్కడి ఫోటోస్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పుడు అక్కడ సినిమా విడుదల అయ్యి నెల రోజులు కావస్తున్నా కూడా క్రేజ్ తగ్గడం లేదు. ప్రస్తుతం ఈ సినిమా వసూళ్ల పరంగా ముత్తు, బాహుబలి 2 తర్వాత స్థానంలో నిలిచింది. ఇంకా కలెక్షన్స్ కొల్ల గొడుతూనే ఉంది.

ప్రస్తుతం ఈ సినిమా గురించి మరో ఆసక్తిరమైన న్యూస్ బయటకి వచ్చింది. మామూలుగా మనకు సినిమా చూసే థియేటర్లు 20 కిలోమీటర్స్ ఉంటే అక్కడిదాకా వెళ్ళడానికి బద్దకిస్తాము. కాని జపాన్ దేశంలో ప్రేక్షకులు ఆర్ఆర్ఆర్ సినిమా చూడటానికి 100 కీలో మీటర్స్ పైగా ప్రయాణించి మరీ చూస్తున్నారట. ఇది చూసి రాజమౌళి,రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో సంతోషం తో ఈ న్యూస్ ను వైరల్ చేస్తున్నారు.