ఒక రాత్రికి నీ రేటెంత అన్నాడట.. ఆ వ్యక్తిని హీరోయిన్ ఏం చేసిందంటే..!

-

ఓ పక్క మీటూ ఉద్యమం కొనసాగుతున్నా హీరోయిన్స్ అంటే చులకనగా చూసే వారి బుద్ధి ఏమాత్రం మారట్లేదని చెప్పాలి. తెర మీద కనిపించే అందాల భామల నిజ జీవిత కష్టాలు ఘోరంగా ఉంటాయి. సోషల్ మీడియా వచ్చాక వారిని ఎంతమాట పడితే అంతమాట డైరెక్ట్ గా అనేస్తున్నారు. ఈ క్రమంలో ఓ కన్నడ నటిని ఏకంగా ఒక రాత్రికి నీ రేటెంత అనేశాడు ఓ ప్రబుద్ధుడు.

హీరోయిన్స్ ఈవెంట్స్ చేస్తుండటం సర్వసాధారణమే.. ఈమధ్యనే ఓ ఈవెంట్ కోసం దుబాయ్ వెళ్లిన నేహా సక్సేనాకు వింత అనుభవం ఎదురైంది. ఈవెంట్ పాల్గొన్న అమ్మడిని చూసిన ఓ వ్యక్తి ఆమె మేనేజర్ నెంబర్ కనుక్కుని ఆమె ఒక రాత్రికి వస్తే ఎంత తీసుకుంటుందని మెసేజ్ చేశాడట. తిన్నగా మేనేజర్ ఆ మెసేజ్ ను నేహాకి చూపించడంతో వ్యవహారం పెద్దదైంది.

అతన్ని కనిపెట్టి మరి చీల్చి చెండాడిందట నేహా సక్సేనా. అంతేకాదు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇలాంటి వాళ్ల వల్లే హీరోయిన్స్ కు అసలు వాల్యూ లేకుండా అవుతుంది. అతగాడికి మంచి కోటింగ్ ఇప్పించి గుట్టుచప్పుడు కాకుండా పంపించిందట నేహా సక్సేనా.

Read more RELATED
Recommended to you

Latest news