వెబ్‌సిరీస్‌గా ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ అన్‌రిపోర్టెడ్‌

-

ది కశ్మీర్ ఫైల్స్ సినిమా ఎంతటి గుర్తింపు తెచ్చుకుందో అందరికీ తెలిసిందే. ఎన్నో వివాదాల మధ్య విడుదలైనా.. బ్లాక్ బస్టర్ టాక్​ను సొంతం చేసుకుంది. సూపర్ కలెక్షన్లు కురిపించి నిర్మాతలకు కాసుల పంట పండించింది. అయితే ఆ సినిమాకు సంబంధించి డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. మరి కొన్ని అంశాలను వెబ్‌ సిరీస్‌ రూపంలో ప్రేక్షకులకు అందించనున్నట్లు ట్విటర్‌ వేదికగా ప్రకటించారు.

‘‘కశ్మీరీ పండితుల మారణ హోమం జరిగిందనే వాస్తవాన్ని అంగీకరించలేని వారు, భారత్‌కు శత్రువులు ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ సినిమాను ప్రశ్నించారు. ఇప్పుడు నేను కశ్మీర్‌ హిందువుల మారణ హోమానికి సంబంధించిన చేదు నిజాన్ని వెబ్‌ సిరీస్‌ రూపంలో మీ ముందుకు తీసుకురానున్నాను. భావోద్వేగాలతో కూడిన ఈ సిరీస్‌ను చూడడానికి సిద్ధంగా ఉండండి. కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవాన్ని కూడా అంగీకరించలేని వారు మాత్రమే దీన్ని విమర్శిస్తారు’ అని వివేక్ ట్వీట్ చేశారు. #KashmirUNREPORTED పేరుతో ఈ వెబ్‌ సిరీస్‌ను తీసుకురానున్నట్లు తెలిపారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ5 వేదికగా ఇది స్ట్రీమింగ్‌ కానున్నట్లు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news