గుజరాత్‌లో వర్షాలకు రోడ్ల మీదకు వస్తున్న మొసళ్ళు

-

గుజరాత్‌లో భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే.. గుజరాత్‌లో వర్షాలకు రోడ్ల మీదకు వస్తున్నాయి మొసళ్ళు. గుజరాత్ లో భారీ వర్షాలకు సముద్రాలు, నదుల్లో ఉండాల్సిన మొసళ్లు జన నివాసిత ప్రాంతాల్లోకి వస్తున్నాయి.

గుజరాత్‌లోని గిర్ జిల్లాలో ఒక పెద్ద మొసలి ఇండ్ల మధ్యలోకి రావడం స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది. అయితే.. ఈ విషయం తెలుసుకున్న అధికారులు… వాటిని తీసుకెళ్లి.. నదుల్లో వేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్‌ గా మారాయి.

కాగా, ఇటు తెలంగాణాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా రాత్రి నుంచి ఏకదాటిగా వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట, బోరబండ, కూకట్పల్లి, మాదాపూర్, ఫిలింనగర్ తదితర ప్రాంతాల్లో వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చాలాచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. GHMC పరిధిలో సాయం కోసం 9000113667 నంబర్ ని సంప్రదించాలని అధికారులు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news