విడుదలకు సిద్దంగా ఉన్న కట్టప్ప కొడుకు”మాయోన్” చిత్రం

బాహుబలి చిత్రంతో కట్టప్పగా టాలీవుడ్ లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్యరాజ్. ఇప్పుడు ఆయన కుమారుడు సిబిరాజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం “మాయోన్”. యువ దర్శకుడు కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు హక్కులను మూవీ మాక్స్ అధినేత, నిర్మాత మామిడాల శ్రీనివాస్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రాన్ని జూలై 7న తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..” పురాతన దేవాలయానికి సంబంధించిన ఒక రహస్య పరిశోధన నేపథ్యంలో హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కిన మిస్టరీ “మాయోన్”. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గాడ్ వర్సెస్ సైన్స్ మెయిన్ థీమ్ గా మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని నిర్మాత మాణికం భారీ బడ్జెట్ తో నిర్మించారని చెప్పుకొచ్చారు. ఈ చిత్రాన్ని జూలై 7న తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.