Moto G22..తక్కువ బడ్జెట్‌లో అమేజింగ్ ఫీచర్స్..! 

-

తక్కువ బడ్జెట్‌లో మంచి ఫోన్‌ కొనాలనుకుంటున్నారా..? మోటోరోలా నుంచి మంచి ఫోన్‌ రిలీజ్‌ అయింది. తొమ్మిది వేలలోపే స్మార్ట్‌ ఫోన్‌ తీసేయొచ్చు. ఈ ఫోన్‌ ఫీచర్స, కెమెరా క్వాలిటీస్‌ సాధారణ కష్టమర్స్‌ కచ్చితంగా యట్రాక్ట్‌ చేసుకునేదిలానే ఉంది.! ఫోన్‌ స్పెసిఫికేషన్ల్‌ ఇలా ఉన్నాయి..!

మోటో జీ22 ధర..

ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధర లాంచ్ అయినప్పుడు రూ.10,999గా ఉంది. అయితే ఇప్పుడు రూ.9,999కే అందుబాటులో ఉంది.
కోటక్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్ఎస్‌బీసీ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం తగ్గింపు లభించనుంది. అంటే రూ.9 వేలకే ఈ ఫోన్ కొనేయచ్చన్న మాట.

మోటో జీ22 ఫీచర్లు..

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై మోటో జీ22 పనిచేయనుంది.
ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ మ్యాక్స్‌విజన్ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గానూ, డిస్‌ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9గానూ ఉంది.
ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ37 ప్రాసెసర్‌ను మోటో జీ22లో అందించారు.
4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఈ ఫోన్‌లో అందుబాటులో ఉంది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండగా… 20W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో అందించారు.
4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో అందించారు.
ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు.
దీని మందం 0.85 సెంటీమీటర్లు కాగా… బరువు 185 గ్రాములుగా ఉంది.

కెమెరా క్వాలిటీ..

కెమెరా విషయానికి వస్తే… ఈ స్మార్ట్ ఫోన్ వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా… దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news