కేసీఆర్‌ బయోపిక్‌ : టైగర్ కెసిఆర్.. అగ్రెసివ్‌ గాంధీ.. వర్మ మరో సంచలనం

-

ఎన్.టి.ఆర్ బయోపిక్ కు పోటీగా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ తీసి నానా హంగామా సృష్టించిన ఆర్జివి లేటెస్ట్ గా తెలంగాణా రాష్ట్ర సాధకుడు తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బయోపిక్ పై దృష్టి పెట్టాడు. దీనికి సంబందించిన టైటిల్ రివీల్ చేశారు ఆర్జివి. ఇంతకీ ఆ టైటిల్ ఏంటో తెలుసా టైగర్ కె.సి.ఆర్.. ఉపశీర్షికగా ద అగ్రెసివ్ గాంధి అని పెట్టారు. ఆడు తెలంగాణ తెస్తనంటే అందరు నవ్విండ్రు అంటూ పోస్టర్ పై ఓ కామెంట్ కూడా పెట్టాడు.

ఆంధ్రా పాలకుల వల్ల తెలంగాణా ప్రజల కష్టాలను భరించలేని ఆయన తెలంగాణా రాష్ట్రాన్ని సాధించాడు. కె.సి.ఆర్ బయోపిక్ ఎనౌన్స్ చేస్తూ టైగర్ కె.స్.ఆర్ అని పోస్టర్ కె.సి.ఆర్ తనయుడు తెలంగాణా మంత్రి కె.టి.ఆర్ కు ట్యాగ్ చేశారు ఆర్జివి. ఇదవరకు కె.సి.ఆర్ బయోపిక్ లుగా రెండు మూడు సినిమాలు వచ్చాయి ఇది వర్మ కాబట్టి కచ్చితంగా వాటి అన్నిటికి మించి ఉంటుందని చెప్పొచ్చు. మరి ఆర్జివి టైగర్ కె.సి.ఆర్ మిగతా విషయాలు త్వరలో తెలుస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news