నితి‌న్ పై రివేంజి తీర్చుకోవడానికి రెడీ అవుతున్న కీర్తి..

-

మహానటి సినిమా తర్వాత అన్నీ లేడీ ఓరియంటెడ్ సినిమాలే చేసిన కీర్తి, రంగ్ దే సినిమాలో హోరోయిన్ గా నటిస్తుంది. నితిన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అదీగాక ఏమిటో ఇది అంటూ విడుదలైన పాట బాగా ఆకట్టుకుంది.

రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, నితిన్ పై రివేంజి తీర్చుకుంటుందట. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. రంగ్ దే సెట్స్ లో నితిన్ ని వెంటపడుతూ అల్లరి చేసిన కీర్తి సురేష్, రివేంజి తీర్చుకునే సమయం ముందుందని, మరో వీడియోతో వస్తానని తెలిపింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news