ఇళయరాజాకు ‘హరివరాసనం’ పురస్కారం !

-

దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలకు సంగీతం అందించి.. ఎన్నో అద్భుతమైన పాటలు అందించి మ్యూజిక్‌ మేస్ట్రోగా పేరొందిన ఇళయరాజా..ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఆయనకు మరో అరుదైన గౌరవ దక్కింది. కేరళ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘హరివరాసనం’ పురస్కారాన్ని ఆయనకు ప్రకటించింది. వచ్చే నెల 15వ తేదీన శబరిమలైలో ఇళయరాజాకు పురస్కారాన్ని ప్రదానం చేయనుంది.

దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలకు సంగీతం అందించి.. ఎన్నో అద్భుతమైన పాటలు అందించి మ్యూజిక్‌ మేస్ట్రోగా పేరొందిన ఇళయరాజా.. ఇప్పటికే ఎన్నో పురస్కారాలు, సత్కారాలు పొందారు. భారత ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ అవార్డు కింద లక్ష రూపాలయ నగదు, ప్రశంసా పత్రం ఇస్తారు.

ఈ అవార్డును 2012ను కేరళ ప్రభుత్వం ఇస్తుంది. ఈ అవార్డు మొదటి గ్రహీత కేజే యేసుదాసు, అవార్డు అందుకున్నవారిలో పీ సుశీల (2019), కేజీ జయన్‌ (2013), ఎం జయచంద్రన్‌ (2014), ఎస్‌పీ బాలసుబ్రమణ్యం (2015), ఎంజీ శ్రీకుమార్‌ (2016), జి అమరన్‌ (2017), కేఎస్‌ చిత్ర (2018) అందుకున్నారు. మరో విశేషం ఏమిటంటే అదే రోజు ఇళయరాజా వర్‌షిఫుల్‌ మ్యూజిక్‌ జీనియస్‌ అవార్డును కూడా అందుకోనున్నారు.

– కేశవ

 

Read more RELATED
Recommended to you

Latest news