ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన KGF2 ఫిల్మ్ రికార్డుల వేట కొనసాగిస్తోంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో రాఖీ భాయ్ హవా కొనసాగిస్తున్నాడు. గత నెల 14న విడుదలైన పిక్చర్ ను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. తాజాగా రాఖీ భాయ్ ఖాతాలో మరో రికార్డు నమోదైంది.
‘బాహుబలి 2’ తర్వాత అతి తక్కువ సమయంలో హిందీ బెల్ట్ లో రూ.400 కోట్లు సాధించిన చిత్రంగా KGF2 నిలిచిందని ఎంటర్ టైన్మెంట్ ఇండస్ట్రీ ట్రాకర్ రమేశ్ బాలా..స్పష్టం చేశారు. ఆ రికార్డు బ్రేక్ చేయగల సత్తా కూడా ఈ సినిమాకు ఉంటుందని ఈ సందర్భంగా రమేశ్ బాలా ట్వీట్ చూసిన నెటిజన్లు అంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా చూసి సినీ లవర్స్ హ్యాపీగా ఫీలవడమే కాదు..ప్రశాంత్ నీల్ టేకింగ్ కు ఫిదా అవుతున్నారు. ఇక ఈ చిత్రం ఆల్ టైమ్ బ్లాక్ బాస్టర్ మాత్రమే కాదని, సెకండ్ హయ్యెస్ట్ గ్రాసింగ్ హిందీ ఫిల్మ్ గా నిలవడం పట్ల శాండల్ వుడ్ సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ తన నెక్స్ట్ ఫిల్మ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేస్తున్నారు. ‘సలర్’ పిక్చర్ 20 పర్సెంట్ షూటింగ్ కూడా అయిపోవడం విశేషం. ఈ సినిమా తర్వాత తారక్ తో ఫిల్మ్ చేయనున్నారు ప్రశాంత్ నీల్.
#KGFChapter2 Hindi will cross the ₹ 400 Crs Nett mark at the #India Box office today..
Only the 2nd Hindi movie after #Baahubali2 to achieve this feat..
— Ramesh Bala (@rameshlaus) May 6, 2022