పెళ్లి తర్వాత తొలిసారి కలిసి నటించబోతున్న కియారా- సిద్ధార్థ్..!

బాలీవుడ్ లో మోస్ట్ రొమాంటిక్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న కియారా అద్వానీ ,సిద్ధార్థ మల్హోత్రా ఇటీవల మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వివాహానికి ముందు వీరిద్దరూ కలసి జంటగా నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ పెళ్లయిన తర్వాత మొదటిసారి జంటగా కనిపించడానికి సిద్ధం అవుతున్నారు. ఇక ఈ క్రేజీ కాంబినేషన్ నుసెట్ చేయడానికి స్టార్ మేకర్ కరణ్ జోహార్ కూడా సిద్ధం అవుతున్నారు. సాధారణంగా వెండితెరపై కమర్షియల్ కాంబినేషన్ సెట్ చేయడంలో కరణ్ జోహార్ ది అందవేసిన చేయి.. ఏ కాంబినేషన్ సెట్ చేస్తే ఆ కాంబినేషన్ పక్కా కమర్షియల్ గా వర్క్ అవుట్ అవుతుందని అందరూ చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే సిద్ధార్థ్, కీయారా లను రంగంలోకి దించడానికి ప్రయత్నం చేస్తున్నారు కరణ్ జోహార్.

ఇదిలా ఉండగా చాలా కాలం పాటు ప్రేమలో ఉండి రీసెంట్గా పెళ్లి చేసుకున్నారు సిద్ధార్థ మల్హోత్రా కియారా అద్వానీ.. ఇంకా వెడ్డింగ్ మూడ్ లోనే ఉన్న ఈ జంటను వెండితెర మీద కూడా జంటగా చూపించడానికి కరణ్ జోహార్ ప్లాట్ఫారం సిద్ధం చేస్తున్నారు. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన షేర్షా చిత్రం విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయింది. అందుకే ఇప్పుడు మరోసారి అదే మ్యాజిక్ ను రిపీట్ చేసే ఆలోచనలో పడ్డారు మేకర్స్.

ప్రస్తుతం కరణ్ జోహార్ బ్యానర్లోని తెరకెక్కుతున్న యోధా సినిమాలో సిద్ధార్థ నటిస్తున్నారు. కియారా కూడా సౌత్ , నార్త్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలు పూర్తయిన వెంటనే ఈ కాంబో సెట్స్ మీదకు వెళ్లబోతోంది మరి పెళ్లి తర్వాత చేయబోతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాలను అందిస్తుందో చూడాలి.