బేబమ్మ బర్త్‌ డే స్పెషల్‌.. శర్వానంద్ 35 నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

-

టాలీవుడ్‌ బేబమ్మ అదేనండి కృతిశెట్టి.. ఉప్పెన సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఉప్పెనలా దూసుకొచ్చింది. వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. జయాపజయాలతో సంబంధం లేకుండా అవకాశాలు అందుకుంటోంది. ఈ బ్యూటీ పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా ఈ భామ లేటెస్ట్ సినిమా అప్డేట్ వచ్చింది.

ఈ భామ టాలీవుడ్ మోస్ట్ ప్రామిసింగ్ నటుడు శర్వానంద్ లేటెస్ట్ మూవీలో ఛాన్స్ కొట్టేసింది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న శర్వా35 సినిమాలో కృతి హీరోయిన్​గా నటిస్తోంది. నేడు కృతిశెట్టి పుట్టినరోజు. ఈ సంద‌ర్భంగా బ‌ర్త్‌ డే విషెస్ చెబుతూ శర్వా 35 నుంచి కృతిశెట్టి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఇక ఈ మూవీ టైటిల్‌తో పాటు టీజర్ ఈవెంట్‌ల‌కు సంబంధించిన అప్‌డేట్‌లను త్వరలోనే ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ట్విటర్‌లో రాసుకోచ్చారు. ఇదిలా ఉండ‌గా.. ఈ మూవీకి మనమే (Maname) టైటిల్‌ ఫిక్స్ చేసినట్టు ఫిలింనగర్ సర్కిల్‌ టాక్.

Read more RELATED
Recommended to you

Latest news