దేశంలో పెరుగుతున్న రక్తహీనత కేసులు.. మహిళలే టార్గెట్‌

-

వయసు పెరిగే కొద్దీ మహిళల్లో రక్తహీనత ఎక్కువైపోతుంది. చాలామందిలో రక్తంలో హిమోగ్లోబిన్ పరిమాణాలు తగ్గి దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి. ప్రస్తుతం చాలామంది వృద్ధుల్లో ఐరన్‌ లోపించి సమస్యలు వస్తున్నాయి. దీని కారణంగా శరీరంలోని రక్త పరిమాణాల్లో మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా వయస్సు మళ్ళిన స్త్రీలలో రక్తంలోని హిమోగ్లోబిన్ పరిమాణాలు తగ్గుతాయి. దీని కారణంగా రక్తహీనత, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు తలెత్తి అవకాశాలున్నాయి. కాబట్టి వయస్సు పెరిగే కొద్దీ శరీరంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మంచిదని. లేకపోతే తల తిరగడం, శరీరంపై సమస్యలు ఇతర దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

కాబట్టి ఇలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి శరీరానికి తగిన పరిమాణంలో ఐరన్ తప్పనిసరి. అయితే చాలామంది స్త్రీలు ఐరన్ లోపం నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి సప్లిమెంట్స్ వాడుతున్నారు. వీటివల్ల భవిష్యత్తులో తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటికి బదులుగా ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని ఆహారాలను ప్రతిరోజు తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి పోషకాలు అందడమే కాకుండా తగిన పరిమాణంలో ఐరన్ కూడా లభిస్తుంది.

ఐరన్ లోపం సమస్యతో బాధపడేవారు తప్పకుండా ఆహారంలో అలసంద పప్పును తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పప్పులో అధిక పరిమాణంలో ఐరన్‌తో పాటు పోషకాలు కూడా లభిస్తాయి. కాబట్టి ఈ పప్పును ప్రతి రోజు తినడం వల్ల ఐరన్ లోపం నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా శరీరం దృఢంగా కూడా తయారవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రక్తహీనత సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు తీసుకునే ఆహారాల్లో భాగంగా అలసంద పప్పుతో తయారు చేసిన ఆహారాలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.

రక్తహీనత సమస్యను తగ్గించడానికి నల్ల ఎండు ద్రాక్ష కూడా ప్రభావవంతంగా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. రాత్రంతా నానబెట్టిన ఎండుద్రాక్ష నీటిని ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల శరీరానికి తగిన పరిమాణంలో ఐరన్ లభిస్తుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

వీటితో పాటు యాపిల్‌, దానిమ్మ, పాలకూర, బీట్‌రూట్‌, క్యారెట్‌ తింటుంటే బాడీకి ఐరన్‌ బాగా పడుతుందని వైద్యులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news