Surya 41 : సూర్యతో రొమాన్స్ చేయనున్న కృతిశెట్టి

-

తమిళ్‌ హీరో సూర్య, సుప్రసిద్ద దర్శకుడు బాల కాంబినేషన్‌ లో ఇప్పటికే రెండు సినిమా వచ్చాయి. సూర్య కెరీర్‌ లోనే బెస్ట్‌ అనిపించుకున్న నంద, పితామగన్‌ చిత్రాల తర్వాత మరోసారి బాలాతో ముచ్చటగా మూడో సినిమా చేయబోతున్నారు సూర్య. ప్రేక్షకాదరణతో పాటు అవార్డులూ అందుకున్న ఈ రెండు సినిమాలు సూర్య కే కాదు.. బాలకూ దర్శకుడిగా మంచి గుర్తింపును తెచ్చి పెట్టాయి.

ఇక ఇవాళ వీరిద్దరి కాంబినేషన్‌ లో మూడో సినిమా కన్యాకుమారిలో పూజా కార్యక్రమాలతో మొదలు కానుంది. జ్యోతిక, సూర్య సమర్పణలో వారికి చెందిన 2 డీ ఎంటర్‌ టైన్మెంట్స్‌ బ్యానర్‌ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.

అయితే.. ఈ సినిమా అదిరిపోయో అప్డేట్‌ ను వదిలింది చిత్ర బృందం. సూర్య నటించబోయే ఈ 41 వ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌ గా నటిస్తోంది. ఈ విషయాన్ని చిత్ర బృందం స్వయంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ కూడా వదిలింది. కాగా.. ఈ సినిమాలో కూడా సూర్య లాయర్‌ గెటప్‌ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version