అవకాశాల కోసం రకుల్.. పూజాను ఫాలో అవుతున్న కృతి శెట్టి..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మొదటిసారిగా ఉప్పెన చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచిత్రాలు అయింది హీరోయిన్ కృతి శెట్టి. ఆ తరువాత వరుసగా సినిమాలతో సక్సెస్ తో స్టార్ హీరోయిన్ రేంజ్ లో తన పేరును సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. కానీ ఈమె స్టార్ డమ్ ఎక్కువ రోజులు నిలబడలేదని చెప్పవచ్చు. ముఖ్యంగా నితిన్ తో కలిసి మాచర్ల నియోజకవర్గం, సుధీర్ బాబుతో కలిసి ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. రామ్ తో కలిసి దివారియర్ సినిమా నటించగా ఇవన్నీ ఘోరమైన ఫ్లాప్లుగా నిలిచాయి. దీంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు అంతగా రాలేదని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక అంతే కాకుండా చాలామంది కూడా ఈమెను ట్రోల్ చేయడం కూడా జరిగింది.. ఇక ఇలాంటి సమయంలో తన కెరీర్ కోసం అడుగులు వేసింది కృతి శెట్టి.

ఎలాగైనా సరే ఈసారి నటించబోయే సినిమాతో సక్సెస్ అందుకోవాలని ఎంతో కసితో తన మీద , తన శరీరం మీద ట్రోల్స్ రావడంతో అందుకు తగ్గట్టుగా తన శరీరాకృతిని తాజాగా మార్చుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఎక్కువగా బొద్దుగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు చాలా సన్నని జీరో సైజ్ కి వచ్చినట్లుగా తెలుస్తోంది.

అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇక గతంలో కూడా ఎక్కువ బొద్దుగా ఉన్న రకుల్ ప్రీతిసింగ్ కూడా అవకాశాలు తగ్గడంతో ఇలాంటి పనిచేసింది. ఇక పూజ హెగ్డే కూడా సన్నగా ఉండడం చేత ప్రస్తుతం పలు అవకాశాలను అందుకుంటోంది.

ఇక ఇటీవల హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా లావుగా ఉండడం చేత సన్నబడడం కోసం జిమ్ములో వర్కౌట్లు చేస్తూ ఉంది. ఇలాగే కృతి శెట్టి కూడా భావించి బరువు తగ్గించి తాజా ఫోటోషూట్లను షేర్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ఫోటోలు చూసిన నెటిజెన్లు సైతం పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మరి ఇప్పుడైనా ఈ ముద్దుగుమ్మకు పల అవకాశాలు వెలుపడతాయేమో చూడాలి.