నా తండ్రి లైంగికంగా వేధించేవాడు : ఖుష్భూ

-

నటి, జాతీయ మహిళా కమిషన్ మెంబర్ కుష్బూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎనిమిదేళ్ల వయసు నుంచి తాను లైంగిక వేధింపులకు గురయ్యానని నటి, జాతీయ మహిళా కమిషన్ మెంబర్ కుష్బూ వెల్లడించారు. తన తండ్రి నుంచే ఈ వేధింపులు ఎదురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.

భార్య, పిల్లలను కొట్టడం, కుమార్తెను లైంగికంగా వేధించడం తన జన్మ హక్కుగా భావించేవాడని తెలిపారు. తనకు 15 సంవత్సరాలు వచ్చాక అతనిని ఎదిరించడం ప్రారంభించానని, పదహారేళ్లకు తమను వదిలేసి వెళ్లిపోయాడని ఓ ఇంటర్వ్యూలో తన ఆవేదనను బయట పెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news