ఇండస్ట్రీలో విషాదాలు విరామం లేకుండా జరుగుతూనే వస్తున్నాయి. ఇప్పటికే ఎందరో నటీనటులను పోగొట్టుకున్న ఇండస్ట్రీ తాజాగా మరొక షాకింగ్ సంఘటన ఎదుర్కొంది. అయితే, తాజాగా టాలీవుడ్ లో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ అనుమోలు ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు.
ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 2017లో విడుదలైన ‘దర్శకుడు’ మూవీకి ప్రవీణ్ అనుమోలు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. జక్కా హరి ప్రసాద్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో అశోక్ బండ్రెడ్డి హీరోగా నటించగా, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటించారు. సుకుమార్ నిర్మాతగా వ్యవహరించారు. ఆ తర్వాత బాజీరావు మస్తానీ, ధూమ్ 3, బేబీ, పంజా, యమదొంగ చిత్రాలకు అసిస్టెంట్ కెమెరామెన్ గా కూడా ప్రవీణ్ పని చేశారు.
దర్శకుడు మూవీ కెమెరామన్ ప్రవీణ్ అనుమోలు హోర్ట్ స్ట్రోక్ తో కొద్ది సేపటి క్రితమే తుది శ్వాస విడిచారు pic.twitter.com/ulmY21g49u
— Sreedhar Sri (@SreedharSri4u) March 5, 2023