BREAKING : లేడీ సూపర్ స్టార్ నయనతార పెళ్లి ఫిక్స్..ఎప్పుడంటే

-

లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదట్లో హీరోయిన్ గానే కొనసాగిన ఈ లేడీ సూపర్ స్టార్…. ఆ తర్వాత… లేడీ హీరోగా కూడా సినిమాలు కూడా చేసింది. అయితే.. దర్శకుడు విగ్నేష్‌ శివన్‌-నయన తార ప్రస్తుతం లవ్‌ లో ఉన్న సంగతి తెలిసిందే. 5 సంవత్సరాలుగా… వీరు ప్రేమించుకుంటుండగా.. ఇదిగో పెళ్లి, అదిగో పెళ్లి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే… వీరి వివాహంపై ఓ క్లారిటీ వచ్చింది. వీరిద్దరి పెళ్లి తేదీ ఫిక్స్‌ అయినట్లు సమాచారం అందుతోంది. జూన్ 9వ తేదీన వీరిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. తిరుమలలో శ్రీవారి సన్నిధిలో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం అందుతోంది. ఇందులో భాగంగానే వివాహ వేదిక కోసం తిరుమలలో నయనతార మరియు తనకు కాబోయే భర్త విగ్నేష్ తో కలిసి తాజాగా ప్రయత్నిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది.

Read more RELATED
Recommended to you

Latest news