జియో సినిమాలో ఈనెల అలరించే చిత్రాలివే!

-

ఐపీఎల్‌తో యువతకు మరింత చేరువైంది స్ట్రీమింగ్‌ యాప్‌ జియో సినిమా. ఈ క్రమంలో త్వరలోనే సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లతో సర్ ప్రైజ్ చేస్తామని చెప్పింది. చెప్పినట్టుగానే తన మాటను నిలబెట్టుకుంది. ప్రేక్షకులను అలరించేందుకు తన ఫస్ట్ స్టెప్ వేసింది. తాజాగా జియో సినిమాలో బ్లాక్ బస్టర్ బంపర్ హిట్స్ ను త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని ఆ యాప్ నిర్వాహకులు తెలిపారు. ఈ క్రమంలోనే ఈ నెలలో అలరించే సినిమాలను ప్రకటించింది.

హృతిక్‌ రోషన్‌, సైఫ్‌ అలీఖాన్‌ నటించిన ‘విక్రమ్‌ వేద’ ఇప్పటికే స్ట్రీమింగ్‌ మొదలైంది. ఇక రణ్‌దీప్‌ హుడా, ఊర్వశి రౌటెలా నటించిన ‘ఇన్‌స్పెక్టర్‌ అవినాష్‌’ వెబ్‌సిరీస్‌ మే 18వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. అలాగే వరుణ్‌ ధావన్‌, కృతిసనన్‌ జంటగా నటించిన ‘భేదియా’ మే 26 నుంచి అందుబాటులోకి రానుంది. అలాగే స్పై థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌ ‘క్రాక్‌డౌన్‌2’ కూడా ఈ నెలలోనే స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ జియో సినిమా స్పైషల్‌ వీడియోను పంచుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news