లావణ్య త్రిపాఠికి భారీ షాక్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్ అండ్ స్టార్ హీరో ..!

-

కొంతమంది హీరోయిన్స్ కి అందం ఉంటుంది. అభినయమూ ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే గ్లార్ గా కనిపించి రొమాన్స్ కి రెడీ అంటారు. కాని ఎందుకనో స్టార్ హీరోయిన్ గా మాత్రం ఇండస్ట్రీలో సక్సస్ కారు. యంగ్ హీరో తో పాటు స్టార్ హీరో సినిమా లోను ఛాన్స్ అందుకుంటారు. ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతాయి కూడా. కానీ ఈ హీరోయిన్స్ మాత్రం రేస్ లో వెనకబడిపోతారు. ఆలాంటి వాళ్ళలో ముందు ఉంది లావణ్య త్రిపాఠి. అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైంది లావణ్య త్రిపాఠి. యాంక్టింగ్ లో మంచి మార్కులే పడినప్పటికి స్టార్ హీరోయిన్ గా మాత్రం నిలదొక్కుకోలేపోయింది.

 

ఇక లావణ్య త్రిపాఠి కెరీర్ లో చెప్పుకో దగ్గ సినిమాలంటే భలే భలే మగాడివోయ్ సినిమా తరవాత అక్కినేని నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయన అని చెప్పాలి. ఈ రెండు సినిమాలు లావణ్య త్రిపాఠి కి మంచి హిట్ సినిమాలుగా నిలిచాయి. అయితే రాజమౌళి లాంటి వాళ్ళ తో గుడ్ యాక్ట్రెస్ అని కితాబు అందుకున్నప్పటికి టాలీవుడ్ లో ఒక బార్డర్ లైన్ దగ్గరే ఆగిపోయింది. ఇక గత కొంతకాలంగా హిట్ సినిమా లేని లావణ్య కి రీసెంట్ గా నిఖిల్ సిద్దార్థ్ హీరోగా నటించిన ‘అర్జున్ సురవరం’ సినిమాతో హిట్ అందుకొని మళ్ళీ కాస్త ఫాం లోకి వచ్చింది.

ఈ హిట్ తోనే తాజాగా తమిళంలో అధర్వ సరసన నటించే ఛాన్స్ ని దక్కించుకుంది. ప్రస్తుతం తెలుగులో సందీప్ కిషన్ సరసన ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ లోను నటిస్తోంది. స్పోర్ట్స్ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కబోయో ఈ సినిమాలో లావణ్య హాకీ ప్లేయర్ గా నటించబోతుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మళ్ళీ రేస్ లోకి వచ్చింది. దీంతో లావణ్య త్రిపాఠి కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించే బంపర్ ఆఫర్ దక్కించుకుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందే సినిమాలో లావణ్య త్రిపాఠి ని సెలెక్ట్ చేసుకున్నారట.

అయితే ఇప్పుడు లావణ్య కి పెద్ద షాక్ ఇచ్చారని తెలుస్తుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా లావణ్యని ఫైనల్ చేసినట్టు టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ముందుగా ఈ సినిమాలో శృతి హాసన్ ని హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నారు. ‘గబ్బర్ సింగ్’ కాంబినేషన్ ని రిపీట్ చేయాలని చిత్ర యూనిట్ శృతి హాసన్ ని పవన్ కళ్యాణ్ సరసన అనుకున్నారు. కానీ తాజాగా లావణ్య పేరు తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి సెకెండ్ హీరోయిన్ గా అనుకుంటున్నారా ..లేక అసలు లావణ్య త్రిపాఠి లేదా అన్న క్లారిటి మాత్రం రాలేదు. దీంతో లావణ్య త్రిపాఠి షాక్ లో ఉందట.

Read more RELATED
Recommended to you

Latest news