చేతులు కడుక్కోండి.. ఇంట్లోనే ఉండండి.. సురక్షితంగా ఉండండని నీతులు చెప్పడం తప్పా… ఏ ఒక్క హీరోయిన్ కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడం లేదు.ఎంత సేపు స్వీయ నిర్భందంలో ఉన్నప్పుడు తాము ఏం చేస్తున్నారో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే తప్పా వాస్తవ పరిస్థితులను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.
కొందరు వ్యాయామం అంటూ ఫిట్ నెస్ చూసుకుంటూ ఉంటారు.. మరికొందరు బొమ్మలు వేసుకుంటూ.. ఇంకొందరు పాత ఫోటోలను చూసుకుంటూ ఉంటున్నారు తప్పా.. ఇంకేమీ ఆలోచించడం లేదు. ఒక్క పూట కూటికి కష్టపడేవారి గురించి ఆలోచించడం లేదు. స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్న ఎంతో మంది ఒక్క రూపాయి కూడా బయటకు తీయడం లేదు.. విరాళంగా ఇవ్వడంలో లేదు. ఓ వైపు హీరోలు కోట్లకు కోట్లు కుమ్మరిస్తుంటే.. హీరోయిన్స్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.
కరోనా వైరస్‌తో పోరాడే క్రమంలో హీరోలంతా ప్రభుత్వాలకు అండగా నిలబడుతున్న ఈ వేళ.. హీరోయిన్ ప్రణీత కూడా ముందడుగే వేసింది. రోజువారి కూలీలు, పూట గడవని ఓ 50 కుటుంబాలకు రెండు వేల చొప్పున లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తున్నట్టు తెలిపింది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనండని పిలుపు నిచ్చింది.