కరోనా వైరస్ వల్ల దేశమంతా షట్ డౌన్ అయిపోయింది. కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు ఇంటికే పరిమితం కావాలి అంటే ఏప్రిల్ 14 వరకు ప్రకటించడం జరిగింది. మొదట మార్చి 22వ తారీఖున మాత్రమే జనతా కర్ఫ్యూ అంటూ మోడీ ఇచ్చిన ప్రకటనకి దేశమంతా ఇంటికి పరిమితం అయ్యారు. అయితే అదే రోజు సాయంత్రం 22వ తారీఖున మోడీ మాట్లాడుతూ ఏప్రిల్ 14 వరకు దేశమంతటా షట్ డౌన్ పాటించాలని పిలుపు ఇవ్వటం జరిగింది. వైరస్ భారతదేశంలో వ్యాప్తి చెందకుండా ఉండాలంటే కచ్చితంగా ప్రజలంతా ఇంటికే పరిమితం కావాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ క్రమంలో మోడీ పిలుపు చాలామంది సానుకూలంగా స్పందించిన మరికొంతమంది విమర్శించారు.అసలు చైనా దేశంలో అంత దారుణంగా వైరస్ వ్యాప్తి చెందుతున్న టైంలోనే ఇతర దేశాల నుండి మన దేశానికి రాకపోకలు ఆపేయాలని ఈ విషయంలో మోడీ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు సోషల్ మీడియాలో ఆ టైంలో నెటిజన్లు విమర్శలు చేశారు. ఇప్పుడు 21 రోజులు ఇంట్లోనే ఉంటే పేద, మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నించడం జరిగింది. ఇదిలా ఉండగా ముఖ్యంగా ఈ కరోనా వైరస్ గుంపులు గుంపులు గా ఉండే చోటా అదేవిధంగా చేతులు కడుక్కోకుండా ఉంటే ఖచ్చితంగా వైరస్ ముక్కు ద్వారా నోటి ద్వారా కళ్ల ద్వారా శరీరంలోకి ప్రవేశించి ఊపిరితిత్తుల పై ప్రభావం చూపి మనిషిని చంపేయడం గ్యారెంటీ అని చెబుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం షట్ డౌన్ పాటించాలని పిలుపు ఇస్తే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత లేకుండా వదిలేస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యమంత్రులు కూడా కనీసం పట్టించుకోవడం లేదు. కచ్చితంగా ఈ విధంగానే ప్రభుత్వాలు వ్యవహరిస్తే యథా రాజా తథా ప్రజా అన్నట్టు…వైరస్ మొత్తం దేశవ్యాప్తంగా విస్తరించి భారతదేశాన్ని వల్లకాడు చేయడం గ్యారెంటీ అని మరి చాలామంది.