లిరిక్ రైటింగ్‌లో లక్ష్మీ ప్రియాంక హ‌వా..

604

 ఈ కాలంలో  కాస్త టైం దొరికితే ఏం  చేస్తారు. హా.. ఏం చేస్తాం ఫ్రెండ్స్‌తో జాలీగా బ‌య‌ట‌కెళ్తాం. వీకెండ్ అయితే సినిమాకెళ్తాం అని చాలా మంది అంటారు. కానీ దొరికింది కాస్తా స‌మ‌య‌మే అయినా మన‌లోని క్రియేటివిటీకి ఉప‌యోగిస్తే ఆ ఫ‌లితం ఎలా ఉంటుంది?. అద్భుతాలే కాదు, అవ‌కాశాలనూ సృష్టించుకోవ‌చ్చు. అవును .. ఖ‌మ్మం జిల్లాకు చెందిన  ప్రియాంక టైం ను మేనేజ్ చేస్తూ అభిరుచుల‌కు కేటాయిచింది.

చిన్న చిన్న క‌విత్వాల‌తో మొద‌లైన ఆమె అభిరుచి ఇప్పుడు సినిమాల‌కు పాట‌లు రాసే వ‌ర‌కూ తీసుకెళ్లింది. ఎలాంటి ఫీల్ ఉన్న  లిరిక్స్‌ను అయినా రాసి ఉమెన్ లిరిసిస్టుగా క్రేజ్ పొందుతోంది ల‌క్ష్మీ ప్రియాంక‌.  రెండేండ్లుగా సినిమాల‌కు పాట‌లు రాస్తూ ఉన్న ప్రియాంక ఇటీవ‌ల రిలీజ్ అయిన హ‌వా, జోడీ సినిమాల్లో పాట‌లు రాసి పాపుల‌ర్ అయింది.

ఖ‌మ్మం జిల్లా స‌త్తుప‌ల్లికి చెందిన ప్రియాంక హైద‌రాబాద్‌లో ఉన్న‌త చ‌ద‌వుల కోసం సిద్ధం అవుతోంది. స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా పొయెట్రీ రాసి సోష‌ల్ మీడియాలో పెట్టేది. ఆమె రాసే క‌విత్వంలో కొత్తద‌నం ఉండండంతో కొద్ది కాలంలోనే ఎక్కువ క్రేజ్ సంపాధించింది.  మొద‌ట్లో వెబ్‌సిరీస్లు,  షార్ట్ ఫిలిమ్‌ల‌కు రాసింది. త‌ర్వాత స‌ప్త‌గిరి ఎల్ఎల్బీలో ఐటెం సాంగ్ రాసి వావ్ అనిపించింది. అటు త‌ర్వాత మ‌రిన్ని అవ‌కాశాల‌ను అందుకుంది. ఇటీవ‌ల రిలీస్ అయిన హ‌వా సినిమాలో టైటిట్  సాంగ్ రాసి హ‌వా సృస్టించింది. అట్లాగే  ఆది న‌టించిన జోడీ సినిమాలో నువ్వే లేవ‌న్న క్ష‌ణ‌మే సాంగ్‌తో మ‌రొక్క‌సారి క్రేజ్‌పొందింది. అట్లాగే ప్రియాంక కేవ‌లం లిరిసిస్టే కాదు. మంచి ఆర్టిస్టు కూడా. అంద‌మైన డూడుల్స్ వేసి అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్న‌ది.  మండాలాస్ అనే చిత్ర‌క‌ళ‌ను ఆక‌ర్ష‌ణీయంగా వేస్తుంది. ఇటు చిత్ర‌కారిణిగా, మ‌రోవైపు వుమెన్ లిరిసిస్టుగా రాణిస్తున్న ప్రియాంక మ‌రిన్ని అవ‌కాశాలు అందుకోవాల‌ని కోరుకుందాం..

, ప్రియాంక వేసిన చిత్రాలు