విడాకుల పై క్లారిటీ ఇచ్చిన ప్రముఖ సింగర్ హేమచంద్ర

టాలీవుడ్ పాపులర్ సింగర్స్ హేమచంద్ర- శ్రావణ భార్గవి విడాకులు తీసుకుంటున్నట్టుగా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరిదీ లవ్ కం అరేంజ్డ్ మ్యారేజ్. 2013లో ఇరు కుటుంబాల సమ్మతితో పెళ్లి చేసుకున్నారు. హేమచంద్ర సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అందరికీ సుపరిచితుడే. అలాగే శ్రావణ భార్గవి పలు సూపర్ హిట్ సాంగ్స్ పాడింది. పెళ్లి తర్వాత కూడా హేమచంద్ర- శ్రావణ భార్గవి తమ టీం తో కలిసి పలు మ్యూజికల్ ఈవెంట్స్ చేశారు.

అయితే ఇటీవల గత కొన్ని రోజుల నుంచి వీరు విడాకులు తీసుకుంటున్నారని సోషల్ మీడియాలో, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో వార్తలు ప్రసారం అయ్యాయి. ఈ వార్తలపై హేమచంద్ర స్పందించారు. సోషల్ మీడియాలో తన పాటల కన్నా పనికిమాలిన ముచ్చట్లే త్వరగా వైరల్ అవుతున్నాయని వ్యంగ్యంగా స్పందించారు. విడాకులు తీసుకుంటున్నారు అంటూ వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. వెర్రి తనానికి, సమయాన్ని వృధా చేసుకునే వారి కోసం అంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

https://www.instagram.com/p/CfWf_-1hvz0/?igshid=YmMyMTA2M2Y=