గ్లింప్స్ అదుర్స్.. ‘హారాల్డ్ దాస్’ వచ్చేశాడు

-

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా నటిస్తున్న తాజా మూవీ లియో. ఈ సినిమాకి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్నిసెవెన్ స్క్రీన్ స్టూడియో సంస్థ నిర్మిస్తోంది. ఇందులో త్రిష, ప్రియా ఆనంద్, గౌతమ్ మీనన్, మిస్కిన్, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్ నటుడు, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఇవాళ అర్జున్ సర్జా బర్త్ డే కావడంతో లియో మూవీ మేకర్స్ క్రేజీ అప్డేట్ విడుదల చేశారు.

అర్జున్ సర్జాకి సంబంధించిన గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాలో ఆయన హరోల్డ్ దాస్ అనే క్యారెక్టర్ లో అర్జున్ కనిపించనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు లోకేష్ కనగరాజ్ ట్విట్టర్ లో షేర్ చేశఆరు. హ్యాపీ బర్త్ డే అర్జున్ సార్ అంటూ.. థ్యాంక్ యూ సార్ ఎక్స్ ట్రార్డినరీ ఎఫర్ట్ అంటూ విషెస్ చెప్పారు. అయితే గ్లింప్స్ చూస్తుంటే అర్జున్ ఫుల్ యాక్షన్ రోల్ లో కనిపిస్తున్నారు. ప్రతినాయకుడిగా ఓ రేంజ్ లో ఉండనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 19 థియేటర్లలో రిలీజ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news