మహేష్ ‘మహర్షి’ యానిమేటెడ్ టీజర్.. డైరక్టర్ షాక్..!

-

సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా మహర్షి. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. అల్లరి నరేష్ కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. సినిమాకు సంబందించిన ఓ టీజర్ రిలీజైంది. మహర్షిలో మహేష్ స్టైల్ అదిరిపోయిందని టీజర్ చూస్తేనే అర్ధమవుతుంది.

ఇక ఈ టీజర్ ను డిటో దించేస్తూ గా ఓ యానిమేషన్ టీజర్ రెడీ చేశాడు ఓ మహేష్ బాబు అభిమాని. అది అక్కడ ఇక్కడ వైరల్ అవడంతో ఏకంగా మహర్షి డైరక్టర్ వంశీ పైడిపల్లి దగ్గరకు చేరింది. మహర్షి టీజర్ లోని ఒరిజినల్ వాయిస్, మ్యూజిక్ ఉంచి యానిమేటెడ్ టీజర్ సిద్ధం చేశాడు సూపర్ స్టార్ అభిమాని. అది చూసిన వంశీ పైడిపల్లి అతని వర్క్ ను మెచ్చుకున్నాడు. అంతేకాదు యానిమేటెడ్ టీజర్ కూడా చాలా బాగుందని అన్నాడు.

మే 9న రిలీజ్ అవుతున్న మహర్షి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అదరగొడుతుంది. మహేష్ కెరియర్ లో మహర్షి మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుందని అంచనాలు పెంచేస్తున్నారు దర్శక నిర్మాతలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version