మహర్షి కొత్త పోస్టర్ అదిరింది..!

సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి డైరక్షన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా మహర్షి. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా మహేష్ 25వ సినిమాగా వస్తుంది. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుండి ఇన్నాళ్లు మహేష్ పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి తప్ప హీరోయిన్ పోస్టర్స్ రిలీజ్ చేయలేదు. లేటెస్ట్ గా మహేష్, పూజా ఇద్దరు కలిసి ఉన్న పిక్ ఒకటి రిలీజ్ అయ్యింది.

అది అఫిషియల్ గా వచ్చిందో లేక లీక్ చేశారో కాని మహేష్ బిగి కౌగిలిలో ఉన్న పూజా హెగ్దె పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూజా ఎప్పటిలానే క్యూట్ లుక్స్ తో కనిపించగా మహేష్ కాస్త రఫ్ లుక్ లో ఉన్నాడు. మహర్షి సినిమాలో మహేష్ డిఫరెంట్ గెటప్పులలో కనిపిస్తాడని తెలిసిందే. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ ఫిక్స్ చేశారు. మరి ఈ సమ్మర్ స్టార్టింగ్ లో మహర్షి చేసే సందడి ఎలా ఉంటుందో చూడాలంటే సినిమా వచ్చే దాకా వెయిట్ చేయాల్సిందే.