రాజశేఖర్ కు కొత్త బిరుదు ఇచ్చేశాడు..!

-

అ! సినిమాతో దర్శకుడిగా తన టాలెంట్ చూపించిన ప్రశాంత్ వర్మ రెండో ప్రాజెక్ట్ గా యాంగ్రీ యంగ్ మెన్ డాక్టర్ రాజశేఖర్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. కల్కి టైటిల్ తో వస్తున్న ఈ సినిమా 1980 నేపథ్యంలో వస్తుంది. ఫిబ్రవరి 4న రాజశేఖర్ బర్త్ డే కానుకగా ఓ రోజు ముందు ఆదివారం ప్రెస్ మీట్ పెట్టి టీజర్ రిలీజ్ చేశారు. సి. కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా బాధ్యత అంతా దర్శకుడు ప్రశాంత్ వర్మ మీద ఉంచారట.

ఇక ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ అ! సినిమాలానే ఇది కూడా డిఫరెంట్ గా ఉంటుందని.. రాజశేఖర్ గారితో పనిచేయడం చాలా బాగుందని.. రాజశేఖర్ అండ్ ఫ్యామిలీ చాలా మంచిదని.. వారు భోజనం పెట్టి చంపేస్తారని అన్నాడు ప్రశాంత్ వర్మ. సినిమాకు నిర్మాత కళ్యాణ్ గారి సపోర్ట్ చాలా బాగుందని అన్నారు. రాజశేఖర్ సార్ ఫ్యామిలీతో మరిన్ని సినిమాలు చేస్తానని అన్నారు ప్రశాంత్ వర్మ. ఇక రాజశేఖర్ కు ఇన్నాళ్లు యాంగ్రీ యంగ్ మెన్ అని స్క్రీన్ నేం ఉంది.. ఇప్పటి నుండి ఆయన యాంగ్రీ స్టార్ అంటూ కొత్త బిరుచు ఇచ్చాడు ప్రశాంత్ వర్మ.

Read more RELATED
Recommended to you

Latest news