త్రివిక్రమ్, మహేశ్ బాబు సినిమా డిఫెరెంట్ జోనర్లో..!!

-

త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే ప్రేక్షకులతో పాటు టెక్నీషియన్ లో, దర్శకులలో కూడా ప్రత్యేక మైన అభిమానం సంపాదించుకున్నారు. అందరూ ఆయన్ని గురూజీ గా పిలుచుకుంటారు. సినిమా పరిశ్రమ లో చాలా మంది స్ట్రగుల్ లో ఉంటే ఆయనతో కొంత సమయం కేటాయిస్తే చాలు హాయిగా ఫీల్ అవుతారు. ఇక ఆయన పెన్ను పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇక తాను ఒక హీరో తో సినిమా చేస్తే మళ్లీ వారితోనే సినిమాలు రిపీట్ చేస్తూ ఉంటారు. ఇక మహేశ్ మూడు సినిమాలు, అల్లు అర్జున్ తో మూడు సినిమాలు, పవన్ కళ్యాణ్ తో మూడు సినిమాలు ఇలా వరసగా వారితోనే మార్చి మార్చి తీస్తూ ఉంటారు. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబు తో SSMB28 వర్కింగ్ టైటిల్ పై సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా కొన్ని రోజులు కథ సెట్ కాక, మరికొన్ని రోజులు మహేశ్ బాబు కుటుంబంలో విషాదాల వల్ల బాగా లేట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మరో షెడ్యూల్ కు రెడీగా ఉంది. ఈ సారి కూడా రామ్ లక్ష్మణ్ ఫైట్ సీన్ తోనే మళ్లీ మొదలు పెడుతున్నారు. ఒక ఇందులో మహేష్ బాబు లుక్ మాత్రం అదిరి పోయేలా ఉంది. మహేశ్ ఒక పట్టాన కథ ను ఒప్పుకోరు, ఇక ఒప్పుకున్నాడు అంటే మళ్లీ అందులో వేలు పెట్టడు. ఈ సారి మాత్రం ఈ సినిమా మాత్రం మహేష్ కెరీర్లోనే చాలా డిఫెరెంట్  జోనర్లో చేస్తున్నారని తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news