మహేష్ ఫాన్స్ ఊపిరి పీల్చుకున్నారా…?

-

సాధారణంగా మహేష్ బాబు సినిమా అంటే ప్రేక్షకుల్లో ఒకరకమైన క్రేజ్ ఉంటుంది. బాలకృష్ణ ను అభిమాని౦చినా, చిరంజీవిని అభిమాని౦చినా ఏ హీరోని అభిమాని౦చినా మహేష్ సినిమాలను చూస్తారు అందరు. దీనితో మహేష్ సినిమా అంటే చాలు ముందు నుంచి కూడా ఒక రకమైన హైప్ ఉంటుంది. అటు దర్శక నిర్మాతలు కూడా మహేష్ సినిమా చేస్తే బాగుండు అని ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు.

ఇప్పుడు ఆయన నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమాపై ముందు నుంచి కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. విజయశాంతి కూడా ఈ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇవ్వడంతో ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూసారు. వారి అంచనాలను మహేష్ అందుకున్నట్టే కనపడుతుంది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకు౦ది అనే టాక్ వినపడుతుంది.

అనీల్ రావిపూడి దర్శకత్వం మీద అనేక అనుమానాలు ఉన్నాయి అభిమానులకు. సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. సంక్రాంతిని తెలుగులో మహేష్ స్టార్ట్ చేసాడు. దర్బార్ సినిమా ప్రభావం పెద్దగా మహేష్ సినిమా చూపించదు. మంచి టాక్ తెచ్చుకోవడంతో అల్లు అర్జున్ సినిమా కూడా ఈ సినిమాపై ప్రభావం చూపించే అవకాశం లేదని భావిస్తున్నారు అభిమానులు. ఇక సంక్రాంతి మహేష్ కి కలిసి వచ్చింది అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news