వరల్డ్‌ రికార్డు సృష్టించిన #HBDMaheshBabu హ్యష్‌ ట్యాగ్‌

-

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు పుట్టినరోజు సందర్భంగా మహేష్‌కు శుభాకాంక్షలు వెల్లువల వచ్చాయి. ఎంతలా అంటే ప్రపంచ రికార్డు సృష్టించేతలా.. నెవర్‌ బిఫోర్‌ ఎవ్వర్‌ ఆఫ్టర్‌ అన్నంతలా 24 గంటల్లో ఏకంగా 60.2మిలియన్ల విషెస్‌ ట్వీట్స్‌ వచ్చాయి.

కరోనా నేపథ్యంలో తన బర్త్‌డే వేడుకలకు దూరంగా ఉండాలని, గుంపులుగా చేరొద్దంటూ తన అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. తమ హీరో చేసిన సూచన పాటిస్తూనే ట్విట్టర్‌పై దాడి చేశారు. 24 గంటల్లో 60.2 మిలియన్ల ట్వీట్స్‌తో ట్విట్టర్‌ పిట్టను దడదడలాడించేశారు. లక్షా ఇరవై ఎనమిదివేల మంది మహేష్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక మహేష్‌ బాబు తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్‌ చేశాడు.

ఇక సూపర్‌ స్టార్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన సర్కారు వారి పాట మోషన్‌ పోస్టర్‌కి కూడా మంచి స్పందన లభించింది.

Read more RELATED
Recommended to you

Latest news