రాజ‌మౌళితో మ‌హేష్ హిస్టారిక‌ల్ సినిమా..!

-

రాజ‌మౌళి నెక్ట్స్ సినిమా మ‌హేష్‌తోనే ఉంటుంద‌ని చెప్పారు. అయితే అది హిస్టారిక‌ల్ సినిమా కాబోతుండ‌టం విశేషం. అయితే మహేశ్ కు చ‌రిత్రాత్మ‌క చిత్రాలంటే భ‌య‌మట‌. మంచి కథ, పాత్ర, దాన్ని అంతే బాగా డీల్‌ చేసే దర్శకుడు వస్తే చేస్తాన‌న్నారు. రాజమౌళితో అలాంటి సినిమా చేయాల‌నుందని చెప్పారు.

హిస్టారిక‌ల్ చిత్రాల‌కు రాజ‌మౌళి కేరాఫ్‌, క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కి మ‌హేష్ కేరాఫ్‌. ఈ ఇద్ద‌రు క‌లిసి ప‌నిచేస్తే నిజంగానే ఆదో క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ అవుతుంది. త్వ‌ర‌లో ఈ అద్బుతం జ‌ర‌గ‌బోతుంద‌ట‌. దీనిపై మ‌హేష్ క్లారిటీ ఇచ్చేశారు. రాజ‌మౌళి నెక్ట్స్ సినిమా మ‌హేష్‌తోనే ఉంటుంద‌ని చెప్పారు. అయితే అది హిస్టారిక‌ల్ సినిమా కాబోతుండ‌టం విశేషం. మ‌హేష్ న‌టించిన మ‌హ‌ర్షి సినిమా ఈ నెల‌9న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను మ‌హేష్ పంచుకున్నారు.

అయితే త‌న‌కు చ‌రిత్రాత్మ‌క చిత్రాలంటే భ‌య‌మట‌. మంచి కథ, పాత్ర, దాన్ని అంతే బాగా డీల్‌ చేసే దర్శకుడు వస్తే చేస్తాన‌న్నారు. రాజమౌళితో అలాంటి సినిమా చేయాల‌నుందని చెప్పారు. మల్టీస్టారర్‌ సినిమాలు కూడా చేయాలనుంద‌ని, మంచి స్క్రిప్ట్‌ దొరికితే ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లతో చేసేందుకు సిద్ధ‌మే అన్నారు. సుకుమార్ సినిమా గురించి చెబుతూ ఎంట‌ర్‌టైన్‌మెంట్ క‌థ చేయాల‌ని సుకుమార్ స్ర్కిప్ట్ ప‌క్క‌న పెట్టార‌ట‌. అనిల్ రావిపూడి సినిమా తర్వాత సుకుమార్ తో ఉంటుంద‌న్నారు. అనిల్ రావిపూడి సినిమా జూన్ ఎండింగ్‌లో ప్రారంభం కానుందట‌. యంగ్‌ డైరెక్టర్స్‌ని ఎంకరేజ్ చేయ‌డంపై స్పందిస్తూ, త‌న‌కు సరిపడ కథ, పాత్రలు వస్తే చేస్తాన‌ని, అలాంటి వాళ్ళు ఎవరూ నా దగ్గరకు రాలేదన్నారు. బ్ర‌హ్మోత్స‌వం, స్పైడ‌ర్ రిజ‌ల్ట్ ని దృష్టిలో పెట్టుకుని ఇక‌పై బౌండెడ్ స్క్రిప్ట్‌తో వచ్చే దర్శకుల సినిమాల్లో న‌చ్చిన క‌థ‌ల‌నే చేయాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. మ‌రోవైపు త్రివిక్ర‌మ్‌, సందీప్ రెడ్డి వంగాలతో క‌థ చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని చెప్పారు.

మొన్న మ‌హ‌ర్షి చిత్ర ప్రీ రిలీజ్ వేడుక‌లో ప‌లువురు ద‌ర్శ‌కుల పేర్లు మ‌ర్చిపోవ‌డంపై అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. కావాల‌నే పూరీ, సుకుమార్ తోపాటు ఇత‌ర ద‌ర్శ‌కుల పేర్ల‌ని స్కిప్ చేశార‌నే కామెంట్స్ వ‌చ్చాయి. ఈ విష‌యాన్ని తాజా ఇంట‌ర్వ్యూలో బాగానే క‌వ‌ర్ చేసుకున్నారు. అభిమానులు ఒక్క‌సారిగా వేదిక‌పై రావ‌డంతో ఒత్తిడికి గుర‌య్యార‌ట‌. అందుకే మ‌ర్చిపోయాన‌న్నారు. ఈ సంద‌ర్భంగా సుకుమార్‌, పూరీ జ‌గ‌న్నాథ్‌ల‌కి థ్యాంక్స్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version