Mahesh Babu: ఫ్యాన్స్‏కు మహేష్ బాబు స్పెషల్ లెటర్..

-

మహేష్‌ బాబు నటించిన తాజా మూవీ సర్కారు వారి పాట. ఈ మూవీ ఈ నెల 12 వతేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే తన ఫ్యాన్స్‌ కు మహేష్‌ బాబు లేఖ రాశారు. సర్కారు వారి పాట షూటింగ్‌ పూర్తయి.. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్‌ కాబోతుందని లేఖలో పేర్కొన్నారు మహేష్‌ బాబు.

ఎన్నో అంచనాలతో, ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న మన సర్కారు వారి పాట చిత్రం థియేటర్లలోనే చూసి.. మీ స్పందన తెలియజేయగలరు అని రాసిన లేఖను విడుదల చేసాడు. అంతేకాదు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఎస్‌ రాధాకృష్ణ నిర్మించే చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ జూన్‌ లో మొదలు అవుతుందని తన సినిమా అప్డేట్‌ కూడా చెప్పేశాడు మహేష్‌ బాబు. మొత్తానికి ఫ్యాన్స్‌ ను తన సినిమా థియేటర్లలోనే చూడండని చెబుతుంటే.. కొత్త సినిమా షూటింగ్‌ త్వరలోనే ఉందని గుడ్‌ న్యూస్‌ చెప్పాడు మహేష్‌ బాబు.

Read more RELATED
Recommended to you

Latest news