సూపర్‌స్టార్‌ మ‌హేష్ బాబు బ‌ర్త్‌డే ఈ రోజు..! ఆర్మీ ఆఫీస‌ర్‌ లుక్‌లో అద‌రగొట్టాడు..! వీడియో..!

-

సూపర్‌స్టార్‌ మ‌హేష్ బాబు శుక్ర‌వారం 44వ వ‌సంతంలోకి అడుగుపెట్టాడు. ఇవాళ ఆయ‌న పుట్టిన రోజు కావ‌డంతో మ‌హేష్ అభిమానులు, టాలీవుడ్ సెల‌బ్రిటీలు ట్విట్ట‌ర్ వేదిక‌గా మ‌హేష్ బాబుకు వెల్లువ‌లా జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.

ప్ర‌ముఖ న‌టుడు మ‌హేష్ బాబు శుక్ర‌వారం 44వ వ‌సంతంలోకి అడుగుపెట్టాడు. ఇవాళ ఆయ‌న పుట్టిన రోజు కావ‌డంతో మ‌హేష్ అభిమానులు, టాలీవుడ్ సెల‌బ్రిటీలు ట్విట్ట‌ర్ వేదిక‌గా మ‌హేష్ బాబుకు వెల్లువ‌లా జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. ఆగ‌స్టు 9, 1975 తేదీన మ‌హేష్ బాబు జ‌న్మించాడు. ఈ క్ర‌మంలోనే ప్రిన్స్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ట్విట్ట‌ర్‌లో ఆయ‌న తాజాగా న‌టిస్తున్న చిత్రం స‌రిలేరు నీకెవ్వ‌రు ట్రెండ్ న‌డుస్తోంది. పెద్ద ఎత్తున అభిమానులు మ‌హేష్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. ఆయ‌న పుట్టిన రోజును అభిమానులు ఒక పెద్ద పండుగలా ఫీల‌వుతున్నారు. చాలా చోట్ల వారు పెద్ద ఎత్తున సంబురాలు జ‌రుపుకుంటున్నారు. అలాగే వారు ప‌లు సామాజిక సేవా కార్య‌క్ర‌మాల‌ను కూడా నిర్వ‌హిస్తున్నారు.

mahesh babu sarileru neekevvaru teaser

ఇక మ‌హేష్‌బాబు పుట్టిన రోజు సంద‌ర్భంగా ఇవాళ ఆయ‌న తాజాగా న‌టిస్తున్న చిత్రం స‌రిలేరు నీకెవ్వ‌రు నుంచి ఓ టీజ‌ర్‌ను లాంచ్ చేశారు. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇక చాలా ఏళ్ల గ్యాప్ త‌రువాత ప్ర‌ముఖ న‌టి, రాజ‌కీయ నాయ‌కురాలు విజ‌య‌శాంతి ఈ మూవీలో న‌టిస్తుండ‌డం విశేషం. అలాగే బండ్ల గ‌ణేష్ తోపాటు ప‌లువురు ప్ర‌ముఖ న‌టీన‌టులు ఈ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు.

స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాలో మ‌హేష్ ఆర్మీ ఆఫీస‌ర్ అజ‌య్ కృష్ణ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈ క్ర‌మంలో ఇవాళ విడుద‌ల చేసిన టీజ‌ర్‌లో మ‌హేష్ ఆర్మీ అధికారి లుక్‌ను రివీల్ చేశారు. ఆ లుక్‌లో మ‌హేష్ అదిరిపోయాడు. దీంతో ఫ్యాన్స్ ఆర్మీ ఆఫీస‌ర్‌గా ఉన్న మ‌హేష్‌ను చూసి మురిసిపోతున్నారు. కాగా ఈ మూవీ వ‌చ్చే సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news