ట్రెండ్ ఇన్: సూపర్ స్టారా మజాకా..ఎవరూ ఊహించని స్థాయిలో మహేశ్ ‘సర్కారు వారి పాట’ ప్రమోషన్స్

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. కాగా, ఈ ఫిల్మ్ ను మహేశ్ బాబు ఎవరూ ఊహించని స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు. ట్వి్ట్టర్ వేదికగా ట్వి్ట్టర్ ఇండియా వారితో ముచ్చటించారు. ఇన్ స్టా గ్రామ్ వేదికగా #AskMB అంటూ తనను ఏదైనా ప్రశ్నించని అంటున్నారు. అలా మహేశ్ బాబు ప్రమోషన్స్ కే కింగ్ అయిపోయాడు.

తన అభిమానులు డెఫినెట్ గా సినిమాను సక్సెస్ చేస్తారని కాన్ఫిడెంట్ గా ఉన్నారు టాలీవుడ్ ప్రిన్స్. ఇక మీడియా వారితో ఇంటరాక్షన్ లో ఇరగదీస్తు్న్నారు మహేశ్. తనదైన టైమింగ్ తో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు చకచక సమాధానాలిచ్చేయడమే కాదు..వారు ఊహించిన స్థాయి ఆన్సర్స్ ఇచ్చి ఆశ్చర్యపరుస్తున్నారు.

ఈ క్రమంలోనే మహేశ్ బాబు అభిమానులు మై క్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వేదికగా #SVPMania
#Mahesh Babu హ్యాష్ ట్యాగ్ ఎస్ వీపీ మేనియా, మహేశ్ బాబు ల పేరిట ‘సర్కారు వారి పాట’ చిత్ర పోస్టర్, మహేశ్ ఫొటోలు షేర్ చేస్తు్న్నారు.

అలా వారి వరుస ట్వీట్లతో సదరు హ్యాష్ ట్యాగ్స్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లోకి వచ్చేశాయి. ‘గీతా గోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన ఈ పిక్చర్ కు ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందించారు.

ఇక రీజినల్ ఫిల్మ్ అయినప్పటికీ ఈ సినిమా కోసం ట్విట్టర్ వారు స్పెషల్ ఎమోజీ రిలీజ్ చేయడం విశేషం. మహేశ్ ఈ సినిమాలో చాలా యంగ్ గా కనిపిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ ఈ చిత్రానికి సంబంధించిన పెన్నీ కాయిన్స్ కూడా రిలీజ్ చేశారు. మొత్తంగా ఈ నెల 12న సినిమా థియేటర్లలోకి రాబోతున్నది.

Read more RELATED
Recommended to you

Latest news